Lady Cop arrests Fiance : కాబోయే వాడిని కటకటాల వెనక్కి నెట్టిన సూపర్ కాప్.. ఎందుకంటే ?
Lady Cop arrests Fiance : తనకు కాబోయే వాడు.. అందగాడు, మంచివాడు అని అందరు అమ్మాయిల్లాగానే కలలుకంది ఆ యువ ఎస్సై. కానీ అతడి అసలు రూపం తెలియడంతో ...కాబోయే వాడని కూడా చూడకుండా కటకటాల వెనక్కు నెట్టింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన అసోంలో జరిగింది.
Lady Cop arrests Fiance : తనకు కాబోయే వాడు.. అందగాడు, మంచివాడు అని అందరు అమ్మాయిల్లాగానే కలలుకంది ఆ యువ ఎస్సై. కానీ అతడి అసలు రూపం తెలియడంతో ...కాబోయే వాడని కూడా చూడకుండా కటకటాల వెనక్కు నెట్టింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన అసోంలో జరిగింది.
అసోంలోని నాగాన్‌లో జున్మోని అనే యువతి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది. అదే జిల్లాకు చెందిన రాణా పొగాగ్‌తో ఆమెకు గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తనను తాను పౌరసంబంధాల అధికారిగా రాణా పోగాగ్.. జున్మోని కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. ఈ నవంబర్‌లో వీరురువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చియించుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడే కీలక మలుపు చోటుచేసుకుంది.
ఓఎన్‌జీసీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ రాణా పొగాగ్ అనేక మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. జున్మోని పని చేస్తున్న అతడు మోసాలకు పాల్పడ్డాడు. అయితే జన్మోని నిజాయతీగల అధికారి అని తెలియడంతో ముగ్గురు బాధితులు ఆమెను ఆశ్రయించారు. వెంటనే ఆమెకు కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అతడి నిజరూపం తెలియడంతో వెంటనే రాణాకు సంకెళ్లు వేసి కటకటాల వెనక్కు నెట్టింది.
మధ్యవర్తుల ద్వారా సంబంధం రావడంతో పెద్దలే ఈ పెళ్లి కుదిర్చారు. అందరు అమ్మాయిల్లాగానే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామని భావిస్తున్న తరుణంగా షాకింగ్ విషయం తెలిసింది. అయినా ఆమె ఏ మాత్రం చెలించలేదు. సామాన్య యువతుల్లా ఏడుస్తూ కూర్చోలేదు. లేదా కాబోయే వాడే కదా అని అతడిని రక్షించే ప్రయత్నం చేయలేదు. మోసగాడిని అరెస్టు చేసి శభాష్ అనిపించుకుంది.
పెద్ద మోసగాడి బారిన పడనందుకు సంతోషంగా ఉందని జున్మోని మీడియాకు తెలిపింది. అతడి గురించి తనకు తెలియజేసిన ముగ్గురికి కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు
Also Read: Natti Kumar Shock to Rgv: ఆర్జీవీకి నట్టికుమార్ షాక్.. డేంజరస్ మూవీ విడుదలపై స్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook