Hindu Girls Marriage Age: హిందువుల అమ్మాయిల పెళ్లి వయస్సు, వారికి కలిగే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ముస్లింల పెళ్లి, వారి సంతానోత్పత్తికి ముడిపెడుతూ అస్సాంకి చెందిన ముస్లిం ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు 18 - 20 ఏళ్ల వయస్సులోనే వారి బిడ్డలకు పెళ్లి చేయాలని, ముస్లింలు వారి బిడ్డలకు అలా ఆ వయస్సులో పెళ్లి చేయడం వల్లే ముస్లిం జనాభా త్వరగా వృద్ధి చెందుతోంది అని అజ్మల్ వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లిం జనాభా సంఖ్య పెరిగినంతగా హిందువుల సంఖ్య పెరగడం లేదన్న బద్రుద్దీన్ అజ్మల్.. హిందువులు కూడా ముస్లిం తరహాలోనే ఆడపిల్లలకు 18-20 ఏళ్ల వయస్సులో మగ పిల్లలకు 22 ఏళ్ల వయస్సులో పెళ్లి చేయడమే హిందువుల సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అంతటితో సరిపెట్టుకోని అజ్మల్.. సంతాన యోగం గురించి మాట్లాడుతూ... పొలం సారవంతంగా ఉన్నప్పుడే పంట సరిగ్గా పండుతుందని.. అలాగే పెళ్లి కూడా చేయాల్సిన వయస్సులో చేస్తేనే సంతాన యోగం కలుగుతుందని వ్యాఖ్యనించారు. 


బదృద్దీన్ అజ్మల్ అరాచకం అంతటితో అగలేదు. హిందువుల్లో యువకులు 22 ఏళ్లకు పెళ్లి చేసుకోకుండా 40 ఏళ్లు వచ్చే వరకు వేచిచూస్తారని.. కానీ అప్పటికే రెండు, మూడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటారని నోరు పారేసుకున్నాడు. 40 ఏళ్ల వయస్సులో ఇంట్లో వారి ఒత్తిడి తట్టుకోలేక పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ముస్లిం కుటుంబాల్లో అమ్మాయిలకు 18 ఏళ్లు రాగానే, అబ్బాయిలకు 22 ఏళ్లు రాగానే పెళ్లి చేసేస్తారని.. అందుకే తమ సమాజంలో త్వరగా సంతాన యోగం కలగడం ద్వారా జనాభా పెరుగుతోందని అన్నారు. 



 


అస్సాంకి చెందిన ఎంపీ అయిన అజ్మల్ చేసిన ఈ వ్యాఖ్యలను అక్కడి అధికార పార్టీ బీజేపి ఎమ్మెల్యే డి కలిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకోవాల్సినంత కర్మ హిందువులకు పట్టలేదని వ్యాఖ్యానించారు. రాముడు, సీతమ్మలను కొలిచే ఈ దేశంలో బంగ్లాదేశీయుల ముస్లిం పోకడలను అనుసరించాల్సిన అవసరం తమకు లేదని కలిత స్పష్టంచేశారు. ఇక్కడ మీ తల్లి, సోదరులను కించపరిచే మాటలు మాట్లాడరాదని హితవు పలికిని కలిత.. ఒకవేళ ఇంకా అలా చేయాలనుకుంటే బంగ్లాదేశ్ వెళ్లిపోవాల్సిందిగా స్పష్టంచేశారు. హిందూ, ముస్లింల మధ్య మతసామరస్యాన్ని ( Hindu - Muslim Relation ) దెబ్బతీసేని అజ్మల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.


Also Read : BJP: బీజేపీలో పదవుల జాతర.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు


Also Read : Rahul Gandhi-Swara Bhasker: రాహుల్‌ గాంధీ పాదయాత్రలో మరో సినీనటి సందడి.. నడిరోడ్డుపై రోజాపూలు ఇస్తూ..!


Also Read : PM Modi Convoy: పిఎం మోదీ రోడ్‌షోలోకి అంబులెన్స్ ఎంట్రీ.. అప్పుడేం జరిగిందంటే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook