New Dress Code For Govt School Teachers in Assam: అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. జీన్స్‌, టీషర్టులు, లెగ్గింగ్స్‌ను ధరించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ దుస్తులు అస్సలు ధరించరాదని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులు ఎంతో నేర్చుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. కొందరు టీచర్లు ప్రజల్లో ఆమోదయోగ్యంగా కనిపించని దుస్తులు ధరిస్తున్నారని.. దీంతో విద్యార్థులపై ప్రభావం పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేస్తూ.. అస్సా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు మాట్లాడుతూ.. పాఠశాల ఉపాధ్యాయులకు సూచించిన దుస్తుల కోడ్‌కు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయని అన్నారు. స్కూల్ టీచర్ల డ్రెస్ కోడ్ గురించి క్లారిటీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు తెలిపారు. కొంతమంది ఉపాధ్యాయులు తమకు నచ్చిన వస్త్రాలను ధరించి పాఠశాల విధులకు హాజరవుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇలా ధరించడం కొన్నిసార్లు ఆమోదయోగ్యంగా అనిపించదని అన్నారు. అందుకే డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 



 




ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు  రనోజ్ పెగు. వృత్తికి గౌరవం తీసుకొచ్చేలా హుందాగా ఉండాలని.. అందుకు తగినట్లు దుస్తులు ధరించడం అవసరమని సూచించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నారాయణ్‌ కౌన్వార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 


నిబంధనలు ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురుష ఉపాధ్యాయులు ఫార్మల్ షర్ట్, ప్యాంటులు ధరించాలని.. మహిళా టీచర్లు హుందాగా ఉండే సల్వార్ సూట్లు, చీరలు, సంప్రదాయ వస్త్రాలు ధరించి విధులుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విధులు నిర్వహించే సమయంలో అన్ని రకాల మర్యాదలకు ఉదాహరణగా భావిస్తారని అన్నారు. ఉపాధ్యాయుల వస్త్రాధారణ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపించకూడదన్నారు.


Also Read: Medak Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook