Terror Attack in Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు(Terrorists) దాడులకు తెగబడ్డారు. అస్సాం రైఫిల్స్‌(Assam Rifles) జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్‌ అధికారి, ఆయన కుటుంబసభ్యులు సహా పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలోని చురాచంద్‌ జిల్లా(Churachandpur district) సింఘత్‌లో ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌(Assam Rifles Canvoy) వెళ్తుండగా.. కొందరు ఉగ్రవాదులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి విప్లవ్‌దేవ్‌ త్రిపాఠి(Colonel Viplab Tripathi), ఆయన భార్య, కుమారుడితో పాటు తక్షణ సహాయ విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Watch Video: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం.. ప్రయాణీకులు సేఫ్..


ఈ ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌సింగ్‌(CM N Biren Singh) తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విప్లవ్‌దేవ్‌ సెలవు ముగించుకుని తిరిగి యూనిట్‌లో చేరేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook