Who is Uttrakhand Next CM: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కమలం నాలుగు రాష్ట్రాల్లో మెజారిటీ మార్క్ దాటి గవర్నమెంట్ ఏర్పాటు చేయటంలో సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోవటంతో ఎవడు ఇపుడు సీఎం చేయాలన్నది కమలనాథులు ఆలోచనలో పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీకే అధికారపగ్గాలు దక్కాయన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీని గెలిపిస్తూ వచ్చిన ఉత్తరాఖండ్ వాసులు ఈ సారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. వరుసగా రెండోసారి బీజేపీకి అధికార పగ్గాలు అప్పజెప్పారు. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 47 చోట్ల కమలనాధులు విజయం సాధించారు. అయితే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ .. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 


కాంగ్రెస్‌కు చెందిన భువన్‌ కప్రీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ గెలిచి పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోవడంతో తదుపరి సీఎం ఎవరన్న చర్చ మొదలైంది. ఆరునెలల క్రితం సీఎం పగ్గాలు చేపట్టి.. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా  పార్టీని గెలిపించారన్న సానుభూతితో మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం జరిగింది. 


అయితే గురువారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన బీజేపీ సీనియర్ నేతలు.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ తదుపరి సీఎం ఎవరన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం. దీంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.మాజీ కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని తదితర పేర్లను పరిశీలించారట. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతల్లో రమేశ్ పోఖ్రియాల్ ఒకరు. 


ఇక అనిల్ బులాని హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితుడు.అయితే ఎంపీగా ఉన్న వ్యక్తిని  సీఎంను చేసేందుకు పార్టీ అధిష్టానం విముఖత చూసినట్లు తెలుస్తోంది. ఎంపీగా ఉన్న వ్యక్తిని సీఎంను చేస్తే వారు ఆరునెలల్లో శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. దాంతో ఇప్పడు గెలిచిన నేతల్లో నుంచే సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో ఈ వ్యవహారంపై క్లారిటీ రానుంది. 


Also Read: Pepaid Recharge Plans: ఎయిర్​టెల్, వి, జియోల్లో.. రూ.200 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!


Also Read: Radhe Shyam LIVE Updates: 'రాధేశ్యామ్' మినిట్ టూ మినిట్ అప్డేట్.. లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook