Assets Seized: ఆ ముగ్గురు ఆర్ధిక నేరగాళ్ల ఆస్థులు సీజ్, వెల్లడించిన కేంద్రమంత్రి
Assets Seized: బ్యాంకు మోసాలు, ఆర్ధిక నేరాలు, రుణాల ఎగవేత, విదేశాలకు పలాయనం సాగించిన ఆ ముగ్గురి వ్యవహారంలో కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఆస్థుల్ని జప్తు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Assets Seized: బ్యాంకు మోసాలు, ఆర్ధిక నేరాలు, రుణాల ఎగవేత, విదేశాలకు పలాయనం సాగించిన ఆ ముగ్గురి వ్యవహారంలో కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఆస్థుల్ని జప్తు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
మొన్న విజయ్ మాల్యా..నిన్న నీరవ్ మోదీ..ఇప్పుడు మెహుల్ చోక్సీ. అందరూ ఒకేరకం దొంగలే. బ్యాంకుల్ని మోసం చేయడం, తప్పుడు పత్రాలు స్యూరిటీగా పెట్టడం, రుణాల ఎగవేత..ఆ తరువాత విదేశాలకు పారిపోవడం. ఇదే చేశారు వీళ్లంతా. ఆర్ధికనేరాలకు పాల్పడిన మాల్యా, మోదీ, చోక్సీలపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు చెందిన 19 వేల కోట్ల విలువచేసే ఆస్థుల్ని స్వాధీనం చేసుకుంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులు తాము ఏర్పా టు చేసిన సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసగించారని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ముగ్గురు కలిసి 22 వేల 585 కోట్ల వరకూ బ్యాంకులను మోసం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం వీరి దగ్గర నుంచి నుంచి 2022 మార్చి 15 వరకు 19 వేల 111 కోట్ల విలువైన ఆస్థుల్ని జప్తు చేసుకునన్నామన్నారు.
జప్తు చేసిన ఈ ఆస్థుల్నించి 15 వేల 113 కోట్ల విలువైన ఆస్థుల్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్టు చెప్పారు. ఇక మరో 335 కోట్ల విలువైన ఆస్తులను భారత ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ కలిసి మోసం చేసిన మొత్తం ఆస్తుల్లో 84.61 శాతం ఆస్తులను ఈపాటికే జప్తు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఫలితంగా బ్యాంకులకు జరిగిన నష్టంలో 66.91 శాతం పూడ్చామని తెలిపారు.
Also read; No Tollgate: నిన్న ఫాస్టాగ్..రేపు జీపీఎస్..జాతీయ రహదారులపై ఇక నో టోల్‌గేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook