Road accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-18 మంది మృతి
West Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. వేగంగా దూసుకెళ్తున్న ఓ వ్యాను రోడ్డు పక్కన ఆగి వున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
West Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రక్కును మెటాడార్ వ్యాను ఢీకొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. నదియా జిల్లాలో శనివారం (నవంబర్ 27) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద సమయంలో మెటాడార్ వ్యానులో 20 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దా నుంచి నవదీప్ శ్మశాన వాటికకు మృతదేహాలను (Dead bodies) తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్బరి వద్ద.. రోడ్డు పక్కన ఆగి వున్న ట్రక్కును మెటాడార్ వ్యాను ఢీకొట్టింది. అతివేగం, ఆ సమయంలో రోడ్డుపై పొగమంచు కమ్ముకుని ఉండటమే ప్రమాదానికి (Road accident) కారణమని స్థానిక పోలీసులు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఇదే పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) సిల్‌గురి ప్రాంతంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో (Road accident) నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో దూసుకెళ్తున్న ఓ లారీ బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డగా పడి వున్న లారీని క్రేన్ సహాయంతో తొలగించారు.
Also Read: Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత..కిమ్స్ లో చేరిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook