Public Holidays: సాధారణంగా ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువే. ఇతర నెలలతో పోలిస్తే ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే, రాఖీ, కృష్ణాష్టమి సెలవులున్నాయి. అందుకే ఈ నెలలో 25, 26 తేదీలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్‌కు సెలవులున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు నెలంటేనే సెలవులతో నిండి ఉంటుంది. 25, 26 తేదీలు ఇప్పటికే పబ్లిక్ హాలిడేస్ ప్రకటించారు. 25వ తేదీ ఆదివారం అన్నింటికీ సెలవు. ఆ రోజు స్కూల్స్, కాలేజెస్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉండవు. 26వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు ఉంది. ఇది కూడా పబ్లిక్ హాలిడే. వారానికి ఐదు రోజులు సెలవులుండేవాళ్లకు మరింత హ్యాపీ న్యూస్ ఇది. సోమవారం అంటే 26వ తేదీ కృష్ణాష్టమి రూపంలో సెలవు రావడంతో 24, 25,26 వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అంటే లాంగ్ వీకెండ్ ఉంటుంది. 


శ్రీ కృష్ణ జన్మాష్టమి కృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటారు. విష్ణు భగవానుడి 8వ అవతారంగా శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. శ్రీ కృష్ణుడు ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో జన్మించాడని నమ్మకం. ఆ రోజు అర్ధరాత్రి జన్మించడంతో పూజ అర్ధరాత్రి జరుపుకుంటారు. పండుగ మాత్రం 26వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి శ్రీ కృష్ణాష్టమి సోమవారం రావడంతో చాలామందికి మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. 


Also read: 7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook