Ayodhya Flight Fare: అయోధ్యకు విమానయానం మరింత ప్రియం, భారీగా పెరిగిన టికెట్ ధరలు
Ayodhya Flight Fare: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. దేశ, విదేశాల్నించి భక్తజనం తరలి రానుండటంతో అయోధ్యకు అన్ని రకాలుగా డిమాండ్ పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విమానయానం ప్రియమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Flight Fare: జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభం అత్యంత ఘనంగా జరగనుంది. యావత్ హిందూవులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం కావడంతో ప్రతి ఒక్కరూ అయోధ్యవైపు చూస్తున్నారు. అందుకే అయోధ్య ఇప్పుడు డిమాండ్‌లో ఉంది. ఒకటేమిటి..అయోధ్యలో అన్నీ అటకెక్కేశాయి.
అయోధ్యలో రామమందిరం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి జనం అయోధ్యకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే చాలా మార్పులు కన్పిస్తున్నాయి. రామ మందిరం నిర్మాణంతో అయోధ్య పునరుజ్జీవమౌతోంది. ఇకపై అయోధ్య అత్యంత ప్రధాన పర్యాటక, పుణ్యక్షేత్రం కానుంది. అయోధ్యలో అన్నీ ప్రియమైపోతున్నాయి. హోటల్ రూమ్స్ ఒక్కొక్కటి రోజుకు 1-2 లక్షలు కూడా పలుకుతున్నాయి. క్యాబ్ సర్వీస్ ధర పెరిగిపోయింది. ఫ్లైట్ టికెట్స్ భారీగా పెరిగిపోయాయి. కొన్ని అంతర్జాతీయ విమాన ధరలతో పోలిస్తే అయోధ్య ఫ్లైట్ టికెట్ ధరలే ఎక్కువగా ఉన్నాయి.
జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభానికి ముందే అయోధ్యకు చేరుకుంటున్నారు. ఫలితంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. జనవరి 19వ తేదీకు ముంబై నుంచి అయోధ్యకు ఫ్లైట్ టికెట్ ఇండిగో ఎయిర్‌లైన్స్ 20 వేలు దాటి చూపిస్తోంది. అదే విధంగా జనవరి 20వ తేదీన కూడా 20వ వేల రూపాయలుంది. ఈ టికెట్ ధర కొన్ని అంతర్జాతీయ విమాన టికెట్ ధరలకంటే చాలా చాలా ఎక్కువ. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ 10,987 రూపాయలు చూపిస్తోంది. అదే విధంగా ముంబై నుంచి బ్యాంకాక్‌కు అదే రోజు టికెట్ ధర 13,800 రూపాయలుంది.
Also read: Sankranthi Holidays 2024: సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook