Ayodhya new mosque: అయోధ్యలో కొత్త మసీదు డిజైన్ చూశారా...కళ్లు చెదిరే రూపం
Ayodhya new mosque: అయోధ్యలో ఐదెకరాల సువిశాల ప్రాంతంలో మసీదు, ఆసుపత్రి రెండూ నిర్మితం కానున్నాయి. అత్యద్భుతమైన డిజైన్‌ను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Ayodhya new mosque: అయోధ్యలో ఐదెకరాల సువిశాల ప్రాంతంలో మసీదు, ఆసుపత్రి రెండూ నిర్మితం కానున్నాయి. అత్యద్భుతమైన డిజైన్‌ను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అయోద్య ( Ayodhya ) లో రామమందిరం ( Rammandir ) నిర్మాణంతో పాటే ఇక్కడ నిర్మించతలపెట్టిన మసీదు డిజైన్‌ను ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ( Indo islamic cultural foundation ) సంస్థ విడుదల చేసింది. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ ఆర్కిటెక్ట్ విభాగపు ప్రొఫెసర్ ఎస్ఎం అఖ్తర్ ( SM Akhtar ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డిజైన్ విడుదల చేశారు. గుడ్డు ఆకారంలో ఉండే మసీదును అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ ( Dhannipur ) లో నిర్మించనున్నారు. మసీదులో ఒకే సమయంలో 2 వేల మంది నమాజు చేసుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు.
5 ఎకరాల స్థలంలో మసీదు ( Mosque ), ఆసుపత్రి ( Hospital ) రెండు భవనాలు నిర్మితం కానున్నాయి. మసీదు డిజైన్‌ను ఎస్ఎం అఖ్తర్ రూపొందించారు. మసీదు ప్రాంగణంలో ఆసుపత్రితో పాటు లైబ్రరీ, మ్యూజియం, కమ్యూనిటీ కిచెన్ కూడా నిర్మిస్తారు. ఈ డిజైన్ ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ధన్నీపూర్ గ్రామంలో నిర్మించనున్న ఈ అధునాతన మసీదు శంకుస్థాపన జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్నారు.
అయోధ్యలో నిర్మించ తలపెట్టిన కొత్త మసీదుకు బాబర్ లేదా మరే ఇతర రాజు పేరు పెట్టమని..ఏ భాషకు సంబంధించి ఉండదన్నారు. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్..ఆరు నెలల క్రితం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ముఖ్య ఆర్టిటెక్ట్ ఎస్ఎం అఖ్తర్ దీనికి తుదిరూపు ఇచ్చారు. కొత్త మసీదు బాబ్రీ మసీదు ( Babri masjid ) కంటే పెద్దదని..ఆ తరహా పై కప్పు ఉండదని ఆర్కిటెక్ట్ అఖ్తర్ తెలిపారు. 14 వందల ఏళ్ల క్రితం మొహమ్మద్ ప్రవక్త ఏం నేర్పించారో..అదే విధంగా మానవ సేవ ఉంటుందన్నారు. దీనికి ఎంత ఖర్చవుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. సువిశాల ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మసీదుకు అనుసంధానంగా సోలార్ పవర్ ప్లాంట్ ఉంటుందన్నారు.
Also read: Indian Railways: ఇండియాలో ఏయే నగరాలకు బుల్లెట్ రైళ్లు