Ayodhya Trains: దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీ మద్యాహ్నం అయోధ్య రామాలయంలో బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఏళ్ల తరబడి నిరీక్షణ తరువాత కొలువుదీరిన రామ్‌లలాను దర్శించుకునేందుకు దేశం నలుమూలల్నించి భక్తులు అయోధ్యకు తరలివెళ్తున్నారు. అయితే అయోధ్య వెళ్లేందుకు దేశం నలుమూలల్నించి ఉన్న రైళ్ల వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య వెళ్లేందుకు ప్రస్తుతం RMM AYC ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది ప్రతి సోమవారం విజయవాడ నుంచి అయోధ్యకు బయలుదేరుతుంది. ఇటీవల రైల్వేశాఖ మరికొన్ని అదనపు రైళ్లను ఏపీకు కేటాయించింది. అవి త్వరలో ప్రారంభం కానున్నాయి.


ఇక బీహార్ నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం ఉంది. PNBE IND ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం పాట్నా నుంచి అయోధ్యకు బయలుదేరుతుంది. PNBE Kota ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో పాట్నా-అయోధ్యకు వెళుతుంది. Farakka ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం, బుధవారం, గురువారం, శనివారాల్లో ఇదే మార్గంలో పయనిస్తుంది. 


ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు DURG NTV ఎక్స్‌ప్రెస్ రాయ్‌పూర్-అయోధ్య మధ్య  ప్రతి గరువారం బయలుదేరుతుంది. 


గుజరాత్ నుంచి అయోధ్యకు Sabarmati ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారాల్లో వడోదర నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం ఉంది. 


ఇక మధ్యప్రదేశ్ నుంచి INDP PNBE ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం ఇండోర్ నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం కలిగి ఉంది. ఇక మహారాష్ట్ర నుంచి అయోధ్యకు Saket ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం, శనివారం నడుస్తోంది. Tulsi ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం, శనివారం ఉంది. ఇక ముంబై నుంచి అయోధ్యకు ప్రతి సోమవారం LTT Ayodhya ఎక్స్‌ప్రెస్ ఉంది. RMM AYC సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం నాగపూర్-అయోధ్య మధ్య ఉంది. ఇదే మార్గంలో YPR GKP ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం నడుస్తోంది. 


ఇక రాజస్థాన్ నుంచి ప్రతి సోమ, మంగళ, శని వారాల్లో Marudhar ఎక్స్‌ప్రెస్, ప్రతి సోమ, మంగళ, గురు వారాల్లో Garib Nawaz ఎక్స్‌ప్రెస్ జైపూర్ నుంచి అయోధ్యకు వెళ్తాయి.  Kota PNBE ప్రతి గురు, శుక్ర, ఆదివారాల్లో కోటా నుంచి అయోధ్యకు వెళ్తుంది. Marudhar ఎక్స్‌ప్రెస్ కూడా జోధ్ పూర్ నుంచి అయోధ్యకు వెళ్తుంది. ఇక Kavi Guru ఎక్స్‌ప్రెస్ ఉదయపూర్ నుంచి అయోధ్యకు నడుస్తోంది. 


దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రతి సోమ, మంగళ వారాల్లో ANVT Mau ఎక్స్‌ప్రెస్,  ప్రతిరోజూ Ayodhya, Kaifiyat ఎక్స్‌ప్రెస్‌లు, ప్రతి సోమ, మంగళ, గురు వారాల్లో Garib Nawaz ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బుధవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. 


అరుణాచల్ ప్రదేశ్ నుంచి నేరుగా అయోధ్యకు ప్రస్తుతం రైలు సౌకర్యంలేదు. అదే విధంగా అస్సోం నుంచి కూడా అయోధ్యకు డైరెక్ట్ రైలు లేదు. గోవా నుంచి అయోధ్యకు నేరుగా రైళ్లు లేవు. అదే విధంగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఘండ్ రాష్ట్రాల్నించి అయోధ్యకు డైరెక్ట్ రైలు సౌకర్యం లేదు. అదే విధంగా మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశాల నుంచి డైరెక్ట్ రైలు సౌకర్యం లేదు. 


Also read: Best Laptops: అద్బుతమైన ఫీచర్లు, కాన్ఫిగరేషన్‌తో తక్కువ ధరకు టాప్ ల్యాప్‌టాప్‌లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook