Ayodhya Ram Mandir - Silver Screen Rama: వెండితెర రాముళ్లు.. సిల్వర్ స్క్రీన్‌పై శ్రీ రాముడి పాత్రలో ఒదిగిపోయిన హీరోలు వీళ్లే..
Ayodhya Ram Mandir - Silver Screen Rama: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరనున్నాడు. రాముడి విషయానికొస్తే..
Ayodhya Ram Mandir - Silver Screen Rama: జగదభి రాముడు శ్రీరాముడు ఆయన నీల మేఘశ్యాముడు.. రఘుకులాబ్ది సోముడు. పరంధాముడు.. కోదండ రాముడు. భద్రాది రాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచిన అది ఆయనకే చెల్లుతుంది. రాతిని నాతిని చేసే పరమపాదం రాముడు. ఆయనది ఖండంతార ఖ్యాతి. రాముడు ఆదర్శపురుషుడు. స్థితి కారకుడైన మహావిష్ణువు మానవరూపంలో దివినుంచి భువికి దిగివచ్చిన దివ్యరూపమే రామావతారం. భారతీయులందరికి ఆయన ఒక మార్గదర్శి. రాముడు ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతిరూపం. కుటుంబ విలువలను నిలబెట్టిన వ్యక్తి. ఆయన సత్యపాలకుడు. ఏక పత్నీవతుడు. పాలకుడి బాధ్యతకు అర్ధాన్ని చెప్పి కోట్లాది మంది జీవనవేదమయ్యాడు రాముడు. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు.. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు.సరిగ్గా ఆ అభిజిత్ ముమూర్తంలోనే అయోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరంలో బాల రాముడిగా కొలువు తీరడం విశేషమనే చెప్పాలి.
ఆ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు. మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు..కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు రామాయణం చూస్తే అర్థమవుతుంది. మన సిల్వర్ స్క్రీన్ పై రామాయణంపై ఎన్నో చిత్రాలున్నాయి. అందులో చాలా మంది కథానాయకులు .. అసలు సిసలు కథానాయకుడైన శ్రీరాముని పాత్రలో మెప్పించిన వారు ఉన్నారు. ఇంతకీ తెలుగు సినీ వినీలాకాశంలో రాముడి పాత్రలో ఒదిగిన హీరోలు ఎవరెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
తింటే గారాలు తినాలి.వింటే భారతం వినాలి.కంటే రామాయణం కనాలన్న సూత్రం ఫాలో అవడం భారతీయులకున్న అలవాట్లలో కొన్ని. అందునా తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. రాముడ్ని చూసినా..ఆయన గురించి విన్నా ...తమను తాము మర్చిపోతారు. అల నాటి లవకుశ నుంచి నేటి ఆదిపురుష్ వరకు రామగాథను గానం చేసినవే.
రాముడు మంచి బాలుడు అన్న సామెత అలాంటిదే. అలాంటి రాముడికి తెలుగు సినిమాకు అవినాభావ సంబంధం వుంది. రాముని అవతారం ఎంతో ఉన్నతమైనది. ఆ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు. మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు..కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు రామాయణంలో ఇమిడి ఉన్నాయి.
అసలు తెలుగు సినిమా పౌరాణికాలతో షురూ అయింది. మన దగ్గర తెలుగుల రాములోరి కథతో వచ్చిన ఫస్ట్ మూవీ 'శ్రీరామపాదుకా పట్టాభిషేకం". 1932లో విడుదలైన ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ ఫస్ట్ టైమ్ రాముని పాత్రలో కనువిందు చేసారు. ఆ తర్వాత కొంత మంది నటులు రాముని పాత్రలో నటించి మెప్పించారు. ఇక తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఇప్పటికీ రాముడంటే ఎన్టీవోడే.
ఇక తెలుగు సినిమా ముచ్చటకొస్తే....రాముడంటే ఇలాగే వుంటడా అనే విధంగానటించి అందరి మన్ననలు అందుకున్న నటుడు ఎన్టీఆర్. సిల్వర్ స్క్రీన్ పై రామారావుని శ్రీరామునిగా చూసిన ప్రేక్షకులు ఆయన్ని నిజంగనే రాముడిలానే కొలిచారు. ఈ రకంగా రాముని పాత్రలో ఆకట్టుకోవడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది.
రామో విగ్రహవాన్ ధర్మహ: అని సంస్కృతంలో ఒక మాటుంది. అంటే శత్రువు కూడా రాముడి ఎంతటి గొప్పవాడో అని తెలిపేవి. ఇక ఎన్టీఆర్ తర్వాత రాముడుగా మెప్పించిన మరో నటుడు హరనాథ్. ఎన్టీఆర్ మొదటిసారి మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన 'సీతారామ కళ్యాణం' మూవీలో రామారావు రావణా బ్రహ్మగా యాక్ట్ చేస్తే...హరనాథ్ కోదండరాముడిగా ఆకట్టుకోవడం విశేషం. ఈ మూవీలో సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే పాట తెలుగు సినిమాల్లో ఆణిముత్యంగా నిలిచిపోయింది.
రాముడంటే ఉత్తమ సంస్కారం. మన జీవితంలో రామాయాణాన్ని ఉదాహరణగా చెబుతూ రావడం మనకందరికి తెలిసిందే కదా. ఇక లవకుశ సినిమాల లక్ష్మణుడిగా మెప్పించిన కాంతారావు...వీరాంజనేయతో పాటు ఇంకొన్ని తెలుగు సినిమాల్లో రాముడిగా మెప్పించడం విశేషం.
ఇక రామారావు, కాంతారావుల కంటే ముందే ఏఎన్నాఆర్ ఆయన నట జీవితాన్ని రాముడి పాత్రతో షురూ చేయడం విశేషం. ఇక కోదండ రాముడిగా శోభన్ బాబుది డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'సంపూర్ణ రామాయణం'లో శోభన్ బాబు రాముని పాత్రలో నటించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
సంపూర్ణ రామాయణం సినిమా రామయ్య తండ్రీ...ఓ రామయ్య తండ్రీ...మా సామీ వంటి నీవేలే రామయ్య తండ్రీ...అంటూ వచ్చే పాట ఇప్పటికీ తెలుగువారి మదిలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని తెలుపుతునే వుంది.
శోభన్ బాబు తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ కథ ‘సీతా కళ్యాణం’. ఈ సినిమాలో జయప్రద సీతగా నటిస్తే...మలయాళ నటుడు రవి శ్రీరాముడిగా నటించాడు.ఉత్తారాదిన రామ జన్మభూమి అయోధ్య ఎలాగో...దక్షిణాన వున్న మనకు భద్రాచలం అంతే. ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు వెండితెరను రామమయం చేశాయి. ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు మూవీలో సుమన్ శ్రీరాముడిగా మెప్పించడం విశేషం.
అసలు రామాయణం అంటే రాముడి నడిచిన దారి అనే అర్థం వుంది. నాన్న మాట కోసం రాముడు వనవాసం చేసాడు. ఇంతలోనే సీతమ్మను రావణాసురుడు అపహరించడం. ఆ తర్వాత రావణున్నిసంహరించి సీతమ్మను విడిపిస్తాడు రామయ్య.ఇదీ మూడు ముక్కల్లో రామాయణం. ఇగ ఇప్పటి తరం హీరోల్లో శ్రీకాంత్ 'దేవుళ్లు' సిమాలో రాముడిగా కొంచెం సేపు తెరపై కనువిండు చేసాడు.
ఇక రామాయణంపై వచ్చిన మరో మూవీ శ్రీరామరాజ్యం. లవకుశ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో రాముని పాత్రల బాలకృష్ణ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నందమూరి మూడో నటవారసుడు శిన్నేన్టీఆర్ ....ఆయన నటజీవితాన్ని రామాయణం సిన్మాతో మొదలుపెట్టాడు.ఈ రకంగా ఒకే ఇంటికి చెందిన మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి.
లేటెస్ట్‌గా గతేడాది తెలుగు తెరపై రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభు శ్రీరామ్ పాత్రలో నటించారు. కానీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించడం పై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఏది ఏమైనా ప్రభాస్ కూడ ఈ శ్రీరామ చంద్రుడిగా కనువిందు చేయడం అభిమానులకు తీపి జ్ఞాపకం అని చెప్పాలి. మరోవైపు అల్లు అరవింద్ కూడా ‘రామయణం’ మూవీ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అందులో రణ్‌బీర్ కపూర్, యశ్ రాముడిగా.. రావణాసురుడిగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
రాముడి విషయానికొస్తే.. రాముడిది ఒకే మాట. ఒకే బాణం..ఒకే భార్య ...ఒకే విధానం. ప్రస్తుతం మన సమాజం పోతున్న దిశను గమనిస్తే.. రాముని వ్యక్తిత్వం మన సమాజానికి ఎంతో అవసరం. ఇది వెండితెరపై తెలుగు రాముడి లీల.మొత్తంగా అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు తీరుతున్నఈ వేళలో రామ భక్తులకు మధర జ్ఞాపకం అనే చెప్పాలి.
Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్ వంశీయులు
Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్ షర్మిలకు ఘోర అవమానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook