దీపావళి పర్వదినానికి అయోధ్య ముస్తాబవుతోంది. ఒకటి కాదు..రెండు  కాదు...వంద కాదు. 2 వేలు కాదు. ఏకంగా 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందంగా అలంకృతం కానుంది. దీపావళి శోభను మరింతగా పెంచనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హిందూవుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. ఏళ్ల తరబడి పరిష్కారం  కాకుండా ఉన్న వివాదం అయోధ్య రామజన్మభూమి వివాదం ( Ram janmabhoomi dispute ) . దశాబ్దాల తరబడి అపరిష్కృత సమస్యగా ఉన్న అయోధ్య శ్రీ రామజన్మభూమి వివాదానికి తెరపడింది. రామజన్మభూమి ప్రాంతంలో రాముడి భవ్యమందిరానికి భూమిపూజ కూడా ముగిసింది. వివాదం ముగిసి..రాముడి పవిత్ర ఆలయానికి భూమిపూజ జరిగిన తరువాత అయోధ్యలో ఇది తొలి దీపావళి.


అందుకే అయోధ్య ( Ayodhya ) ను మరింత అందంగా...వైభవోపేతంగా..భక్తిమయంగా మార్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీపావళి ( Diwali ) ని పురస్కరించుకుని అయోధ్యలో ఏకంగా 5 లక్షల 51 వేల ప్రమిదల్ని( 5.51 lakhs lamps ) వెలిగించనున్నారు. 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందాన్ని పెంచనున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య తొలి దీపావళిని చూసేందుకు భక్తులు తరలిరానున్నారు. రాముడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 11 రధాల్ని రామజన్మభూమి ట్రస్ట్ ( Ram janmabhoomi trust ) సిద్ధం చేసింది. ఈ ప్రదర్శన సాకేత్ మహా విద్యాలయం నుంచి ప్రారంభం కానుంది. దీపావళి నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ( Up Cm Yogi Adityanath ) అయోధ్య చేరుకోనున్నారు. రామ్ లల్లా  ( Ramlalla )  దర్శనం చేసుకుని..5 లక్షలకు పైగా దీపాల్ని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Also read: Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య