Indian Railways Rules: రైళ్లలో దూరప్రయాణాలు చేసే వారికి షాకిచ్చింది భారతీయ రైల్వే శాఖ. ప్రయాణికులకు సమకూర్చే దుప్పట్లు, దిండ్లు, బెడ్​ షీట్ల వంటి వాటికోసం ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దుప్పట్లు, బెడ్ షీట్లకు భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛార్జీలు ఎందుకు?
నిజానికి కరోనాకు ముందు ఏసీ కోచ్​లలో ప్రయాణించే వారికి దిండ్లు, దుప్పట్లు, బెడ్ షీట్లను ఉచితంగానే ఇచ్చేది రైల్వే శాఖ. ప్రయాణికులు వాటిని వాడుకుని రైళ్లలోనే వదిలేయాల్సి ఉండేది. అయితే కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతరులు వాడిన వస్తువులను ముట్టుకోవడానికే చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే సేవలు తిరిగి ప్రారంభైనప్పటి నుంచి..  ప్రయాణికుల భధ్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెడ్​ షీట్ల, దుప్పట్ల వంటి వాటిని సమకూర్చడం ఆపేసింది రైల్వే శాఖ. కానీ మళ్లీ ఇటీవల చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రయాణికుల్లో దుప్పట్లు, దిండ్ల వంటి వాటికి డిమాండ్ పెరిగింది.


Also Read: Case Filed Against Mohan Babu:'మా' గొడవలో మోహన్ బాబు.. భద్రాద్రి కొత్తగూడెంలో కేసు నమోదు


అయినా.. కరోనా భయాల వల్ల రైల్వే అందించే వాటిని వాడేందుకు భయపడుతున్నారు. దీనితో ఛార్జీలు వసూలు చేసి.. డిస్పోజబుల్​ దుప్పట్లు, దిండ్లు, బెడ్​ షీట్లను అందించేందుకు  సిద్ధమైంది రైల్వే శాఖ. ఇందు కోసం ఢిల్లీ సహా పలు రైల్వే స్టేషన్లలో ఇప్పటికే.. ఆల్ట్రా-వైలెట్ శానిటైజేషన్​ మిషిన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అంటే ఛార్జీ చెల్లించి తీసుకున్న  దిండ్లు, దుప్పట్లను ప్రయాణికులు తమతో పాటే తీసుకెళ్లొచ్చు.
ఈ దిండ్లు, దుప్పట్లు, బెడ్​ షీట్ల వంటి వాటి కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ.


ప్యాకేజీలు ఇలా..
1) రూ.300- ఈ ప్యాకేజీలో రెండు బెడ్​ షీట్లు, ఒక దుప్పటి సహా.. ఒక బ్యాగ్, చిన్న సైజ్​ టూత్​ పేస్ట్, పేపర్​ సబ్బు, శానిటైజర్ ప్యాకెట్, టిష్యూ వంటివి ఉంటాయి.
2) రూ.180- ఈ ప్యాకేజ్​లో ఒక దుప్పటి మాత్రమే లభిస్తుంది.
3) ఒక బెడ్​ షీట్ కావాలంటే.. రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.
4) రూ.70 చెల్లిస్తే ఒక దిండును సమకూరుస్తుంది రైల్వే శాఖ.


Also Read: India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా


5) చిన్న టూత్​ పేస్ట్​, టూత్ బ్రష్​, శానిటైజర్​, పేపర్ సబ్బు, టిష్యూ వంటివి కావాలంటే రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.
6) మాస్క్​లు, చిన్న సైజ్​ ఆక్సిజన్​ సిలిండర్ వంటి వాటికోసం కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.


అయితే ప్రస్తుతం ఢిల్లీ రైల్వై డివిజన్​లో నడిచే రైళ్లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర రైళ్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే శాఖ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి