Bank Holidays 2024: దేశంలోని ప్రతి బ్యాంకుకు జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులుంటాయి. రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. అదే విధంగా డిసెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు భారీగానే ఉన్నాయి. మీక్కూడా బ్యాంకు పనులుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ సెలవులున్నప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడుతుంటాయి. ప్రాంతీయ సెలవులు మాత్రం రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 29 మధ్యలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, అదివారాలు కూడా ఉన్నాయి. చెక్‌బుక్, పాస్‌బుక్ సంబంధిత పనులుంటే మాత్రం సెలవు రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిసెంబర్ నెలలో ఇప్పటికే 9 రోజులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన 22 రోజుల్లో 12 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. అవేంటో తెలుసుకుందాం.


డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే
డిసెంబర్ 11 యూనిసెఫ్ బర్త్ డే బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 14 రెండవ శనివారం
డిసెంబర్ 15 ఆదివారం
డిసెంబర్ 18 గురు ఘాసీదాస్ జయంతి ఛత్తీస్‌గఢ్ సెలవు
డిసెంబర్ 19 గోవా లిబరేషన్ డే, గోవాలో సెలవు
డిసెంబర్ 22 ఆదివారం సెలవు
డిసెంబర్ 24 తేజ్ బహదూర్ వీరమరణం పొందిన రోజు మిజోరాం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌లో సెలవు
డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 26 బాక్సింగ్ డే సెలవు
డిసెంబర్ 28 నాలుగవ శనివారం సెలవు
డిసెంబర్ 29 ఆదివారం సెలవు


సెలవు రోజుల్లో ఆన్‌లైన్ సేవలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగదు. నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. బిల్లు పేమెంట్లు, నగదు బదిలీ జరుగుతుంది. ఏటీఎం సేవలు కూడా కొనసాగనున్నాయి.


Also read: LIC Pension Scheme: నెలకు 12 వేలు పెన్షన్ అందించే బెస్ట్ ఎల్ఐసీ స్కీమ్, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి