Basavaraj Bommai resigned to his CM Post : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపి 65 స్థానాలకే పరిమితమైంది. బీజేపి ఓటమి నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపికి చెందిన పలువురు కీలక నేతలతో కలిసి రాజ్ భవన్‌‌కి వెళ్లిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్‌కి తన రాజీనామా లేఖ సమర్పించగా.. గవర్నర్ థావర్ చంద్ , సీఎం బొమ్మై రాజీనామాను ఆమోదించారు. అనంతరం ఈ విషయాన్ని బొమ్మై మీడియాకు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకరకంగా లోక్ సభ ఎన్నికలను తలపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపి హై కమాండ్‌కి చెందిన అగ్రనేతలు కర్ణాటకకు క్యూ కట్టి మరీ ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు కర్ణాటక భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయని.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని బీజేపి ఊదరగొట్టినప్పటికీ.. కర్ణాటకలో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు.