Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్‌ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పథకం వల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుందని మోదీ ప్రభుత్వం చెబుతోంది. దీనిని ప్రతిపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి. ఇలాంటి స్కీమ్స్‌ వల్ల అభ్యర్థుల జీవితం అగమ్యగోచరంగా మారుతుందని మండిపడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..అగ్నిపథ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సైనికుల సర్వీసు నాలుగేళ్లు అయితే ఆ తర్వాత వారి ఎలా జీవితం ఎలా ఆమె ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల అభ్యర్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుందన్నారు. అగ్నివీరుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లను పెంచాలని డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే..కుట్ర పూరితంగా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. 


బీజేపీలాగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉండవన్నారు. బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈసందర్భంగా అగ్నిపథ్‌పై స్పందించారు. అగ్నివీరులను తీసుకుని నాలుగు మాసాల శిక్షణ ఇచ్చి..నాలుగేళ్లపాటు ఉద్యోగానికి తీసుకుని..ఆ తర్వాత వదిలేస్తే..ఆ తర్వాత వారంతా ఏం చేయాలన్నారు. అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Also read:India vs England: ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఎవరు..అతడికి ఈసారి అవకాశం ఉంటుందా..?


Also read:Chief Justice Ujjal Bhuyan: రేపే రాజ్‌భవన్‌లో కొత్త సీజే ప్రమాణస్వీకారం..సీఎం కేసీఆర్ హాజరుపై సస్పెన్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి