Family plans crime inspired from Drishyam movie: సినిమాల ప్రభావం జనాలపై గట్టిగానే ఉంటుంది.. సినిమాల్లో నటీనటుల డైలాగులు, మేనరిజమ్స్‌ను అనుకరించడమే కాదు.. కొంతమంది సినిమాలు చూసే క్రైమ్స్ చేసేందుకు ఇన్‌స్పైర్ అవుతుంటారు.. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఓ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అచ్చు 'దృశ్యం' సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ భారీ క్రైమ్‌కి స్కెచ్ వేశారు. మొదటి ప్రయత్నంలో సక్సెస్ అవడంతో.. రెండోసారి కూడా అదే ఫాలో అయ్యారు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో కథ అడ్డం తిరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని (Bengaluru) అనేకల్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొద్ది నెలల క్రితం ఓ నేరానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఓ వ్యక్తి ద్వారా తమ బంగారాన్ని యశ్వంత్‌పూర్‌లోని ఓ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టారు. ఆ తర్వాత తమ ఇంట్లో బంగారం చోరీకి గురైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్నిచోట్ల వెతికి చివరకు ఆ పాన్ బ్రోకర్ వద్ద బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారాన్ని తీసుకొచ్చి వారికి అప్పగించారు. దీంతో తమ మొదటి ప్రయత్నం సక్సెస్ అయిందని వారు సంబరపడ్డారు.


ఆ తర్వాత అదే తరహాలో మరో నేరానికి స్కెచ్ వేశారు. ఈసారి 1250 గ్రా. బంగారాన్ని తమ డ్రైవర్‌ దీపక్‌కు ఇచ్చి పలువురు పాన్ బ్రోకర్స్ వద్ద తాకట్టు పెట్టించారు. ఒకవేళ దొరికిపోతే డ్రైవర్‌కు బెయిల్ ఇప్పించడంతో పాటు అతనికి కొంత డబ్బు ఇప్పించేందుకు ఆ కుటుంబం డీల్ కుదుర్చుకుంది. అనుకున్నట్లుగానే ఆ డ్రైవర్ బంగారాన్ని తీసుకెళ్లి బెంగళూరులోని పలువురు పాన్ బ్రోకర్స్ వద్ద తాకట్టు పెట్టాడు.


ఆ తర్వాత ఆ కుటుంబానికి చెందిన ఆశా అనే మహిళ సెప్టెంబర్ 19, 2021న సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను షాపింగ్‌కి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్‌ను చోరీ చేశాడని.. అందులో 1250 గ్రా. బంగారం ఉందని పోలీసులకు కట్టు కథ చెప్పింది. అది కట్టు కథ అని తెలియక.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఇలా అడ్డంగా దొరికిపోయారు :


కేసు విచారణ క్రమంలో పోలీసులు ఆ కుటుంబ సభ్యులను విచారించగా.. అచ్చు దృశ్యం (Drishyam Movie) సినిమాను ఫాలో అయ్యారు. ముందుగానే అందరూ చర్చించుకుని.. పోలీసులు ఏం అడిగినా అందరూ ఒకటే చెప్పేలా ఒక నిర్ణయానికి వచ్చారు. అనుకున్నట్లు గానే పోలీసులకు అంతా ఒకే స్టోరీ చెప్పారు. పోలీసులు 500 గ్రా. బంగారాన్ని (Gold) స్వాధీనం చేసుకుని ఆ కుటుంబానికి చూపించగా.. అది తమదేనని చెప్పారు. అయితే ఆ బంగారు ఆభరణాలు ముస్లిం కుటుంబాల్లో ధరించే డిజైన్స్ తరహాలో ఉండటంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. డ్రైవర్‌ దీపక్‌ను తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపెట్టాడు. దీంతో ఆ కుటుంబం వేసిన స్కెచ్ బెడిసికొట్టినట్లయింది. ఆ కుటుంబానికి చెందిన రవి ప్రకాష్ (55)తో పాటు అతని కుమారుడు మిథున్ (30), కోడలు సంగీత, కుమార్తె ఆశా, అల్లుడు చరణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Also Read: అప్పు చేసి iPhone కొన్నాడు.. తిరిగివ్వమంటే Rape చేస్తానన్నాడు.. సీన్ కట్ చేస్తే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook