Bengaluru violent case - former mayor arrest: బెంగ‌ళూరు: ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక ( Karnataka ) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఆగస్టులో హింసాత్మక ఘర్షణ ( Riots ) లు చెలరేగిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని డిజే హల్లీ, కెజీ హల్లీ (DJ Halli & KG Halli violence) పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో నలుగురు మరణించగా.. 60మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు కారణమైన న‌గ‌ర‌ మాజీ మేయర్‌, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్‌ సంపత్‌ రాజ్‌ను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప‌రారీలో ఉన్న‌ సంప‌త్‌రాజ్‌తోపాటు ఆయన సహచరుల‌ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్లడించారు. Also read: Bengaluru Riots: సోషల్ మీడియా పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. ఇద్దరు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పులకేషినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి (akhanda srinivas murthy) బంధువు వివాదాస్పద పోస్టు పెట్టడంతో అల్లరిమూకలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగాయి. దీంతోపాటు పోలీసు స్టేషన్లపైకి కూడా దాడికి దిగాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో.. అల్లరిమూకను నియంత్రించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సంపత్ రాజ్ సహా 60 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ సమర్పించారు. అల్లర్లలో ప్రధాన సూత్రదారులైన కాంగ్రెస్ నాయకులు సంపత్ రాజ్, జాకీర్‌లపై అంతకుముందు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. కోవిడ్ సోకడంతో ఇంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన సంపత్ రాజ్.. డిశ్చార్జ్ అయ్యాక పరారీలో ఉండగా అతన్ని సీసీబీ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.


Also read: Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం


Also read: Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి