భారత్ బంద్ :12 రైళ్లు రద్దు చేసిన రైల్వే
భారత్ బంద్ : 12 రైళ్లు రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే
కోల్‌కతా: పెరుగుతున్న అధిక పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతిపక్షాలు తలపెట్టిన భారత్ బంద్‌లో భాగంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనల కారణంగా 12 రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.
రద్దయిన రైళ్లు, మరో మార్గంలో ప్రయాణిస్తున్న, నిలిపేసిన లేదా ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్ల వివరాలిలా ఉన్నాయి.
1. 12074 భువనేశ్వర్-హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
2. 22819 భువనేశ్వర్-విశాఖపట్టణం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
3. 18018 రూర్కెలా-కోరాపూట్ ఎక్స్‌ప్రెస్ (షెడ్యూల్ మారింది)
4. 58301 సంబల్‌పూర్ -కోరాపూట్ ప్యాసింజర్ రాయగడ వద్ద రద్దయింది.
5. 18005 హౌరా - జగదల్‌పూర్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు లక్ష్మీపూర్ రోడ్ వద్ద నిలిచిపోయింది.
6. 18448 జగదల్‌పూర్ - హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (మరో మార్గంలో నడుస్తోంది)
7. 18438 జునాఘర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలును విజయనగరం వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జోడించనున్నారు.