Bharat Bandh today: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్‌ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విపక్ష పార్టీలు, వామపక్షాలు, (opposition partys support bharat bandh) కార్మిక సంఘాలన్నీ మద్దతునిచ్చాయి. భారత్ బంద్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి. అన్నదాతలు నిర్వహించే ఈ బంద్‌కు దేశవ్యాప్తంగా మద్దతు భారీగా పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) రాష్ర్టాలకు సూచించింది. దీంతోపాటు రైల్వే శాఖ కూడా తన సిబ్బందిని అప్రమత్తం చేసింది. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంతియుతంగా నిరసన తెలపాలి
భారత్ బంద్‌ సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కీలక రోడ్లను దిగ్బంధించనున్నట్టు రైతు సంఘాల నేతలు (Farmer union leaders) సోమవారం ప్రకటించారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బంద్‌ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలుపాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని వారు అభ్యర్థించారు. అయితే బంద్‌ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు రైతు నేతలు తెలిపారు. బంద్‌ పాటించాల్సిందిగా ఎవరినీ బలవంతం చేయొద్దని అందరినీ సూచించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. సవరణలు తమకు అవసరం లేదని.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. Also read: 
Bharat Bandh in AP: రైతన్నల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


ఇదిలాఉంటే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Chalo protest ) అన్నదాతలు చేస్తున్న నిరసన నేటితో 13వ రోజుకు చేరింది. ఇప్పటికే.. ఈ ఆందోళనపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఐదుసార్లు జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ రేపు మరోసారి చర్చలు జరగనున్నాయి. Also read: Eluru mystery disease: అంతుచిక్కని ఏలూరు వింత వ్యాధి లక్షణాలు..జాగ్రత్తలు


 


Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook