Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..
Nasal Vaccine Booster: కరోనా కొత్త వేరియంట్ భయాందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. బూస్టర్ డోస్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Nasal Vaccine Booster: ప్రపంచాన్ని మళ్లీ వణికించేందుకు కరోనా మహామ్మారి సిద్ధమవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా పంజా విసిరేందుకు కాచుకుకూర్చొంది. చైనాను అల్లకల్లోలం చేసి.. ఇతర దేశాలలో తన ప్రతాపం చూపేంచుందుకు దూసుకువస్తోంది. బీఎఫ్.7 వేరియంట్ భారత్‌లోనూ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. బహిరంగా ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించింది. మరోవైపు వ్యాక్సిన్ వేసుకోని వారు వెంటనే వేయించుకోవాలని కోరుతోంది.
అదేవిధంగా నాజల్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ శుక్రవారం నుంచి కోవిన్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుంది. కోవిడ్ నాజల్ వ్యాక్సిన్‌ను బూస్టర్‌గా తీసుకోవచ్చు. ఏ వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా.. మీరు నాజల్ వ్యాక్సిన్‌ను బూస్టర్‌గా తీసుకోవచ్చు. ప్రస్తుతం కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ప్రైవేట్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ వ్యాక్సిన్ కావాలంటే దాని కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
కరోనా సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితిపై ఆరోగ్య మంత్రుల కీలక సమావేశం జరిగింది. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం కానున్నారు. మరోవైపు కొత్త వేరియంట్‌పై మొదలైనప్పటి నుంచి బూస్టర్ డోస్‌ల నమోదులో ఊపందుకుంది. గురువారం ప్రధాని మోదీ కరోనాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని, ప్రస్తుతానికి పరిస్థితి గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అన్నారు. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్‌లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది.
Also Read: Brs Mlas Meeting: బీఆర్ఎస్‌లో ముసలం.. తెలంగాణ టు ఏపీ.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ రహాస్య భేటీ..?
Also Read: 7th Pay Commission: కేంద్ర కేబినెట్ మీటింగ్ నేడే.. డీఏ పెంపుపై క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook