Bharath Rice: రేపటి నుంచే `భారత్ రైస్`.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?
Rs 29 Per KG Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరల తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.
Bharath Brand: ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాలు, వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు కొని కడుపునిండా కమ్మగా తినలేని పరిస్థితి. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఇలా వేటి ధరలు చూసినా భగ్గుమంటున్నాయి. ఇక బియ్యం ధరలైతే చెప్పక్కర్లేదు. సాధారణ బియ్యమే రూ.40 పెట్టనిది రావడం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా 'భారత్ రైస్' అనే బ్రాండ్‌ను తీసుకొస్తుంది. ఈ బియ్యం రూ.29కే కిలో అందించేందుకు సిద్ధమైంది. ఈనెల 6వ తేదీ మంగళవారమే భారత్ రైస్ కార్యక్రమం ప్రారంభించనుంది.
Also Read: Raw Cat Eat: దేశంలో ఇంకా ఆకలి కేకలా.. దేశాన్ని నివ్వెరపరిచిన 'పిల్లిని తిన్న యువకుడు' సంఘటన
భారత్ రైస్ పేరిట బియ్యం రూ.29కే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. భారత్ రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 5 లక్షల టన్ను బియ్యాన్ని కేటాయించింది. 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా భారత్ రైస్ విక్రయాలు జరుగనున్నాయి.
Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు
విక్రయాలు ఎక్కడ?
లాంఛనంగా ప్రారంభిస్తున్న భారత్ రైస్‌ను కొన్ని కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తారు. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), భారత సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీపీఎఫ్), కేంద్రీయ భండార్‌కు సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మాత్రమే భారత్ బియ్యం అందుబాటులో ఉంటాయి. మీ సమీప ప్రాంతాల్లో ఆ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసి వెళ్లి భారత్ రైస్‌ను పొందవచ్చు.
పప్పు, పిండి కూడా..
భారత్ రైస్ పేరుతో అతి తక్కువకు బియ్యం అందిస్తున్నట్లే పప్పు, పిండి కూడా అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 'భారత్ దాల్', 'భారత్ వీట్' పేర్లతో ఓ బ్రాండ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పప్పు, గోధుమ పిండి అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. గోధుమ పిండి రూ.27.50, పప్పును రూ.60కి కిలో చొప్పున అందిస్తోంది. భారత్ రైస్ కూడా విజయవంతమైతే భవిష్యత్‌లో మరిన్ని ఆహార పదార్థాలు 'భారత్ బ్రాండ్' పేరిట ప్రజలకు అందుబాటులో తెచ్చే యోచన కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి