ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను హతమార్చేందుకు కుట్ర జరిగింది. పోలీసుల విచారణలో నిందితుడు ఈ సంచలన విషయాన్ని వెల్లడించాడు. వివరాల్లోకి వెళ్లినట్లయితే హర్యానా రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రాను హైదరాబాద్ లో పోలీసులు మూడు  రోజుల క్రితం అరెస్టు చేశారు.ఈ విచారణ సమయంలో సంతప్ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెక్కీ నిర్వహించిన సంపత్


సల్మాన్‌ను హతమార్చేందుకు ముంబైలోని అతని నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించానని విచారణలో సంపత్ వెల్లడించాడు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఇల్లు, అతను వెళ్లే మార్గాలను కూడా తన మొబైల్ తో ఫోటోలు తీసుకున్నట్లు విచారణలో తెలిపాడు.  సల్మాన్ ను హతమార్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని.. హతమార్చిన అనంతరం దేశం విడిచి పారిపోయేందుకు కూడా  ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సంపత్ తెలిపాడు. 


మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సంపత్


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సంపత్ హర్యానాలోని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు. ఇతను హర్యానా, పంజాబ్ , రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్. ఇతనికి పలు హత్యలు, దోపిడీలతో సంబంధం ఉంది. గత కొన్ని రోజులుగా మియాపూర్ లో తలదాచుకుంటున్న సంపత్ ను హైదాబాద్ పోలీసుల సహాయంతో హర్యానా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇలా సల్మాన్ ఖాన్ హత్య కోసం కుట్ర పన్నిన వ్యవహారం ఇలా బయటపడింది.