బిగ్‌బాస్ వర్సెస్ ఛోటాభీమ్; బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ట్విట్టర్ యుద్ధం
సోమవారం కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్విట్టర్ యుద్ధం రాజుకుంటుంది.
సోమవారం కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్విట్టర్ యుద్ధం రాజుకుంది. ప్రధాన మంత్రి నమో యాప్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఛోటాభీమ్‌తో పోలుస్తూ అపహాస్యం చేశారు.
'రాహుల్ జీ, అది యాప్‌లో అడిగే సాధారణ అనుమతులు, అంతేగానీ గూఢాచార్యం కాదని ఛోటాభీమ్‌కు కూడా తెలుసు' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బిగ్‌బాస్ లాంటివారని, అందుకే దేశ ప్రజలపై నిఘాపెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 'మోదీ నమో యాప్ మీ స్నేహితుల, కుటుంబీకుల ఆడియో, వీడియో సమాచారాన్ని రహస్యంగా రికార్డు చేస్తుంది. మీ ప్రదేశాన్ని సైతం జీపీఎస్‌తో ట్రాక్ చేస్తుంది. భారతీయులపై నిఘా పెట్టడం ఆయనకు ఇష్టం' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కాగా నమో, కాంగ్రెస్ యాప్‌లు సమాచార భద్రత విషయంలో లోపభూఇష్టంగా ఉన్నాయని ఆరోపణలు రావడం తెలిసిందే..!