IAS Officers CAT: తమ కేడర్‌ రాష్ట్రానికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్న ఐఏఎస్‌ అధికారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాట ఆమ్రపాలితో సహా ఐఏఎస్‌ అధికారులు ఖంగుతిన్నారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని చేసిన విజ్ఞప్తికి క్యాట్‌ ససేమిరా అని చెప్పింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఐఏఎస్‌ అధికారుల తీరుపై క్యాట్‌ అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆమ్రపాలికి చీవాట్లు పడ్డాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు


ఏపీ కేడర్‌కు చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్‌ రోస్‌ను ఈనెల 16వ తేదీలోపు మీకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లాలని డీఓపీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఏపీకి వెళ్లేందుకు సమ్మతం లేని ఆ అధికారులు సోమవారం క్యాట్‌లో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్‌ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ఇలా చేయడం సరికాదని పేర్కొంది. ఈ సందర్భంగా విచారణ హాట్‌హాట్‌గా కొనసాగింది.


Also Read: KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్‌ రెడ్డిదే బాధ్యత


ఐఏఎస్‌ అధికారుల పిటిషన్‌ఫై క్యాట్‌లో ఐఏఎస్‌ అధికారులకు  చుక్కెదురైంది. డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని క్యాట్‌ ఆదేశించింది. ఈ సందర్భంగా ఐఏఎస్‌ తరఫున న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. కాగా క్యాట్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి క్యాట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ మొదటి వారంలో మళ్లీ కేసు విచారణ జరుగుతుంది.


'ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరదల తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు . అలాంటి చోట్లకు వెళ్లి ప్రజలకు సేవ చేయాలని లేదా?' అని క్యాట్ ఘాటుగా  ప్రశ్నించింది. సరిహద్దులో సమస్యలు వస్తే వెళ్లలేరా? అని నిలదీశారు. ఇంట్లో కూర్చొని సేవ చేస్తామంటే ఎలా? క్యాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అయితే క్యాట్‌ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామని ఐఏఎస్‌ అధికారుల న్యాయవాది తెలిపారు.


క్యాట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లో వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన, రోనాల్డ్‌ రోస్‌ డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తమను తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో విధులు నిర్వహిస్తున్న సృజన కూడా తనను ఏపీలోనే కొనసాగించాలని కోరగా వారందరి విజ్ఞప్తులను క్యాట్‌ తిరస్కరించింది. డీఓపీటీ ఇచ్చిన తీర్పును పాటించాలని స్పష్టం చేసింది. క్యాట్‌ ఇచ్చిన తాజా తీర్పుతో ఈ అధికారులు తమ కేడర్‌ రాష్ట్రాలకు వెళ్తారా? లేదంటే న్యాయస్థానంలో పోరాటం చేస్తారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి