CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు
Nitish Kumar over Poisonous Liquor Death: బీహార్‌లో కల్తీ మద్యం మరణాలపై అనుచితమైన ప్రకటనల పర్వం కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు అతని ఎక్సైజ్ మంత్రి, పరిశ్రమల మంత్రి కూడా చాలా సున్నితమైన విషయానికి సంబంధించి చాలా విచిత్రమైన ప్రకటనలు చేశారు. అదేవిధంగా బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Nitish Kumar over Poisonous Liquor Death: బీహార్ రాష్ట్రం కల్తీ మద్యం మరణాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉండడంతో అనేక మంది కల్తీ మద్యాన్ని సేవించి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు మొత్తం 39 మంది కల్తీ మద్యం సేవించి మృతి చెందారు. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాలకు, ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ కల్తీ మద్యం నిషేధం, మరణాలపై ప్రకటన ఇస్తూ బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు.
కల్తీ మద్యం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు మరణిస్తున్నారని నితీశ్ కుమార్ అన్నారు. బీహార్‌లో మద్య నిషేధం విజయవంతమైందన్నారు. అయితే కల్తీ మద్యం తాగేవాడు చనిపోవడం ఖాయని.. ఇందులో కొత్తేమీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల ప్రజలు కలిసి రాష్ట్రంలో మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమాజంలో ఎంత మంచి పని చేసినా ఎవరో ఒకరు తప్పు చేస్తానరని.. నేరాలను అరికట్టేందుకు చట్టాలు చేసినా హత్యలు జరుగుతున్నాయన్నారు. మద్యపాన నిషేధ చట్టం వల్ల చాలా మంది లబ్ధి పొందారన్నారు.
'ఈ రోజు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మద్యం సేవించడం మానేశారు. ఇంతకు ముందు భర్తలు మద్యం తాగే ఇంటికి వచ్చేవారు.. ఇప్పుడు కూరగాయలు తెస్తున్నారని మహిళలు చెబుతున్నారు. మద్యపాన నిషేధాన్ని చాలా మంది ఆమోదించారు. కల్తీ మద్యం అమ్మేవాళ్లపై కఠిచ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మొదటి నుంచి ప్రజలు విషపూరిత మద్యంతో చనిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు విషపూరిత మద్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన నిషేధం అమలు ఉన్నప్పుడు కల్తీ మద్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కల్తీ మద్యం తాగేవాడు కచ్చితంగా చనిపోతాడు. కల్తీమద్యంపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం..' అని నితీశ్ కుమార్ అన్నారు.
బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా కల్తీ మద్యం మరణాలపై లేవనెత్తడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సభలో సహనం కోల్పోయారు. 'మీకు ఏమైంది..? మద్య పాన నిషేధానికి అనుకూలం కాదా..?' అని ప్రశ్నించారు.
ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మద్యాన్ని నిషేధించినప్పుడు మద్యం సేవించడం తప్పు అని అన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. పోస్ట్‌మార్టం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మద్యపాన నిషేధంపై చట్టం చేశామని.. చట్టాన్ని అతిక్రమించడం తప్పని అన్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ మహాసేథ్ కూడా విచిత్రమైన ప్రకటన చేశారు. శరీర బలాన్ని పెంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. హాజీపూర్‌లో ఆయన వివాదాస్పద రీతిలో మాట్లాడారు. 'ఇది బీహార్‌కు మంచిది కాదు. అలా కాకుండా ఉండాలంటే శరీర బలాన్ని పెంచుకోవాలి. పరుగెత్తాలి, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మద్యం విషం అని ప్రచారం జరుగుతుంటే జనం తాగడం మానేస్తారు. ఆల్కహాల్ స్లో పాయిజన్. ఇది చాలా ప్రతికూలతలను కలిగి ఉంటుంది. కిడ్నీ దెబ్బతింటుంది. మెదడు కూడా దెబ్బతింటుంది..' అని సమీర్ మహాసేథ్ మాట్లాడారు.
Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై
Also Read: PM Kisan: రైతుల ఆదాయం రెట్టింపు.. లెక్కలు బయటపెట్టిన కేంద్ర మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook