Nitish Kumar: మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి క్షమాపణలు
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Nitish Kumar Says Apology: అసెంబ్లీలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దూమరం చెలరేగుతోంది. దీంతో ఆయన వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. జనాభా నియంత్రణలో మహిళల సహకారం గురించి వివరించే క్రమంలో ఆయన కించపరిచే పదజాలం ఉపయోగించారు. జనాభా నియంత్రణలో మహిళ విద్యకున్న ప్రాముఖ్యతను వివరిస్తూ.. శృంగారం విషయంలో అభ్యంతకరకంగా కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు నితీశ్ కుమార్‌పై బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అన్నివైపులా నుంచి విమర్శలు రావడంతో తన ప్రకటనతో ఎవరికైనా ఇబ్బంది కలిగింటే క్షమాపణలు కోరుతున్నానని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.
తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వక్రీకరించారని పేర్కొన్నారు. ‘నా ప్రకటన ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను’ అని అన్నారు. మరోవైపు నితీష్ కుమార్ క్షమాపణలతో సంతృప్తి చెందని ప్రతిపక్ష నాయకులు.. బీహార్ అసెంబ్లీ లోపల నిరసన కొనసాగించారు. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పడంపై ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించారు. బీహార్ సీఎం చేసిన ప్రకటన అవమానకరమని.. దీంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. మహిళల ముందు ఆయన మాట్లాడిన తీరు అసెంబ్లీలో సీ గ్రేడ్ సినిమా డైలాగ్‌లా ఉందన్నారు. ముఖ్యమంత్రి వెనుక కూర్చున్న వ్యక్తులు చెత్తగా నవ్వుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఆ వ్యాఖ్యలను ఇంకా తొలగించలేదని.. బీహార్ అసెంబ్లీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనను రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు.
మంగళవారం బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు బాలికల విద్య ఆవశ్యకతను గురించి చెబుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై ప్రస్తావిస్తూ కించపరిచే విధంగా మాట్లాడారు. భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయని.. అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసని అన్నారు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తోందంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దూమరం చెలరేగుతున్న వేళ ఆయన వెనక్కి తగ్గి.. క్షమాపణలు కోరారు. ఈ వివాదంపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదన్నారు.
Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది
Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook