అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స చేయించుకోవడానికి సెలవు దొరక్కపోవడంతో అదే అనారోగ్యంతో మృతిచెందిన వైనం తోటి సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఆ మహిళా కానిస్టేబుల్ చనిపోవడానికి కారణం ఆమెకు సెలవు మంజూరు చేయని కమాండంటే అని ఆగ్రహానికి గురైన తోటి పోలీసు సిబ్బంది స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కమాండంట్‌పై విరుచుకుపడ్డారు. నీ వల్లే తమ సహోద్యోగిని మృతి చెందింది అంటూ కమాండంట్‌పై పిడిగుద్దులు గుప్పించారు. అతడు తమ పై అధికారి అనే విషయాన్ని కూడా పక్కనపెట్టి ఆ కమాండంట్‌కి దేహశుద్ధి చేసి స్టేషన్ బయటే ఆందోళనకు దిగారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు లా అండ్ ఆర్డర్‌ని చేతుల్లోకి తీసుకుని తమ పై అధికారిపై దాడికి పాల్పడేలా చేసిన ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు శాఖ ఒక్కసారిగా నివ్వెరపోయింది. బీహార్‌లో పోలీసు ఉన్నతాధికారులను షాక్‌కి గురిచేసిన ఈ ఘటనపై పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది.