పాట్నా: సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించడంపై బీహార్ సర్కార్ నిషేధం విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన బీహార్ రాష్ట్ర ఉన్నత కార్యదర్శి మహదేవ్ ప్రసాద్.. ఉద్యోగులందరూ కార్యాలయం సంస్కృతికి విరుద్ధంగా దుస్తులు ధరించి వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే ఇకపై సింపుల్‌గా ఉండే దుస్తుల్లోనే సచివాలయానికి రావాల్సి ఉంటుందని మహదేవ్ ప్రసాద్ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179648","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


డ్రెస్ కోడ్ విషయంలో ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించి తీరాల్సిందేనని బీహార్ సర్కార్ స్పష్టంచేయడం గమనార్హం.