Bihar rains: పాట్నా: బీహార్‌లో ఉరుమురులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ( Rains in Bihar) పాటు పిడుగుపాటు కారణంగా ఒక్క రోజే 83 మంది మృతి చెందారు. బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లోనే సుమారు 83 మంది మృతి చెందారంటే.. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. ఒక్క గోపాల్‌గంజ్ జిల్లాలోనే అత్యధికంగా 13 మంది మృతి చెందారు. మృతులంతా పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు, కూలీలేనని తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 83 మంది మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు ( Lightning Strike ) కూడా పడుతున్నాయి. ఈ విషయంలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఒకే కుటుంబానికి  చెందిన ఐదు మంది పిడుగుపాటుతో మరణించారని తెలిపింది. 


అక్కడి ప్రజలు వర్షం అంటేనే భయపడుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి బీహార్‌లో కనిపిస్తోంది. ఇంత కాలం లాక్‌డౌన్ వల్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పిడుగుల వల్ల ఇంటి నుంచి కాలు బయటికి పెట్టలేకపోతున్నాం అని అక్కడి బీహారీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.