woman given both Covishield and Covaxin shots in 5 minutes gap: పాట్నా: కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఒక మహిళకు 5 నిమిషాల వ్యవధిలోనే రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బీహర్ రాజధాని పాట్నా జిల్లా అవద్‌పూర్ గ్రామంలో జూన్ 16న సునిలా దేవి అనే 63 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ కోసం స్థానికంగా ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ కొవీషీల్డ్ (Covishield) కోసం ఒక క్యూలైన్, కొవాగ్జిన్ (Covaxin) కోసం మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Covishield and Covaxin shots in 5 minutes gap: ముందుగా కొవీషీల్డ్.. మరో 5 నిమిషాల్లోపే కొవాగ్జిన్..
ఈ సందర్భంగా సునిలా దేవి ముందుగా కొవీషీల్డ్ వ్యాక్సిన్ క్యూలైనులో నిలబడి వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అబ్జర్వేషన్ కోసం కాసేపు గది బయట వేచి ఉండాల్సిందిగా చెప్పి పంపించేశారు అక్కడి సిబ్బంది. ఆ తర్వాత వచ్చి గది బయట కాసేపు నిలబడిన సునిలా దేవి మళ్లీ తనకు తెలియకుండానే వెళ్లి కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం ఏర్పాటు చేసిన రెండో లైనులో నిలబడ్డారు. సునిలా దేవి వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలియని సిబ్బంది ఆమెకు మరోసారి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చారు.


Also read: Milkha Singh dies of COVID-19: కరోనాతో మిల్కా సింగ్ మృతి


పెద్దదైన వివాదం
సునిలా దేవికి అలా 5 నిమిషాల వ్యవధిలోనే రెండు వ్యాక్సిన్లు (Two vaccines in 5 minutes interval) ఇచ్చారని తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే టీకా కేంద్రానికి చేరుకుని సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వారికి గ్రామస్తుల నుంచి మద్దతు లభించడంతో విషయం కాస్తా పెద్దదయింది. ఈ తప్పిదం గురించి తెలుసుకున్న పాట్నా జిల్లా వైద్యాధికారి (Patna DMHO) వెంటనే పలువురు వైద్యుల బృందాన్ని గ్రామానికి పంపించి సునిలా దేవి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. 


నిలకడగా సునిలా దేవి ఆరోగ్యం..
ప్రస్తుతం సునిలా దేవి అబ్జర్వేషన్‌లో ఉందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి టీకా కేంద్రంలో (COVID-19 Vaccine) విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.


Also read: Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MP Vijayasai Reddy ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook