Bipin Rawat Chopper Crash : బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
Minister Rajnath Singh to Brief Parliament: వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎప్పటికప్పుడు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.
Bipin Rawat Chopper Crash Updates: Minister Rajnath Singh is likely to give a statement in Parliament : భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో జరిగింది. ఈ ప్రమాదంలో (Bipin Rawat Chopper Crash) హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff Bipin Rawat) బిపిన్ రావత్ ఉన్నారు. అయితే హెలి కాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణించారు. ఇక ప్రస్తుతం ఒక్కరు మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పదమూడు మంది మరణించినట్లు తెలుస్తోంది. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయింది. ఇక హెలికాప్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక కూడా ఉంది.
ఇక సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ (Helicopter) ప్రమాదంపై గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రమాద ఘటనను ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence minister Rajnath Singh) పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇక కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రావత్ నివాసానికి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెళ్లారు. ఆయన వెంట పలువురు రక్షణశాఖ అలాగే ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ప్రమాదం గురించి బిపిన్ రావత్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి వచ్చారు. అయితే తమిళనాడులోని ఘటనాస్థలికి రాజ్‌నాథ్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి గానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Also Read : Bipin Rawat chopper crash: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌కి తీవ్ర గాయాలు
అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో (Defence minister Rajnath Singh) సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే భేటీ అయ్యారు. ప్రమాదం గురించి పూర్తి సమాచారం.. ఆర్మీ చీఫ్ నరవణే.. కేంద్రమంత్రికి వివరించారు.
Also Read : Bipin Rawat Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook