Bird Flu Cases in Kerala: కేరళలో తాజాగా బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. అలప్పుజ జిల్లాలోని తకాళి పంచాయతీ పరిధిలో ఈ వైరస్‌ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగానూ అక్కడున్న 10వ వార్డు చుట్టూ ఒక కి.మీ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్ అనే ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ గురువారం పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


వాటిపై నిషేధం


బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. ఆ ప్రాంతంలో వాహనాలు, ప్రజల రాకపోకలపై కట్టడి విధించారు. బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించారు.


కేరళలోని హరిప్పడ్‌ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. మరోవైపు వలస పక్షులకు వైరస్‌ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.


ALso Read: Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్​ అత్యక్రియలు నేడు


Also Read: Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్‌ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook