కమల్‌ని హఫీజ్ మహ్మద్‌తో పోల్చిన బీజేపీ
కమల్‌ని కొందరు బీజేపీ ప్రతినిధులు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌తో పోల్చారు. కొందరు రైట్ వింగ్ గ్రూపుకి చెందిన హిందువులు తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని కమల్ వ్యాఖ్యానించిన క్రమంలో ఆయనపై ఈ బహింరంగ వ్యాఖ్యలు చేశారు. "గతంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాలకులు ఎలా ముస్లిం ఓటు బ్యాంకుని కొల్లగొట్టడానికి, హిందువులను పక్కన పెట్టారో.. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే లాంటి వారు అందుకు ఎలా మద్దతు పలికారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే గ్రూపులో కమల్ కూడా చేరారు. ఆయనకు హఫీజ్ అహ్మద్‌కు తేడా లేదు" అని బీజేపీ జాతీయ నాయకుడు జీవిఎల్ నరసింహారావు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పాకిస్తాన్‌కు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారని.. కమల్ ఇలాగే చౌకబారు రాజకీయాలు చేస్తే.. తమిళనాడు ప్రజలు తనకు తగిన గుణపాఠం నేర్పుతారని జీవిఎల్ అభిప్రాయపడ్డారు.