బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క చెప్పిన అమిత్ షా
బీజేపీ ఖేల్ ఖతం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమిత్ షా బదులిచ్చారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయవకాశాలపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు చెబుతున్నా రాసుకోండి...బీజేపీకి 300 సీట్లకు తగ్గకుండా వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పటి వరకు ఆరు దశల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ (272 ) దాటేసిందని ... చివరి దశ పోలింగ్ తర్వాత మరిన్ని సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నాని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో మోడీ హవా ఏమీ లేదని ..బీజేపీ ఓటమి ఖామయని కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కోడెకూస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ 150కి మించి సీట్లు రావని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఇదే అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమిత్ షా... బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని పదేపదే అడుగుతున్నారు..రాసి పెట్టుకొండి..బీజేపీకి 300కి తగ్గకుండా సీట్లు వస్తాయని అమిత్ షా జోస్యం చెప్పారు.