ఒడిశా, మిజోరం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్లు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రకటించింది. ఒడిశా గవర్నర్‌గా హర్యానా బీజేపీ పార్టీ చీఫ్ గణేశిలాల్‌ నియమితులైయ్యారు. ప్రస్తుత ఒడిశా గవర్నర్‌ ఎస్‌.టీ జామీర్‌ మార్చితో పదవి గడవు ముగియడంతో బీహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అదనపు బాధ్యతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గణేశిలాల్‌ను ఒడిశా గవర్నర్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌ వర్గాలు ప్రకటించాయి.  


మిజోరం నూతన గవర్నర్‌గా కేరళ బీజేపీ కుమ్మమానం రాజశేఖరన్‌ నియమితులైయ్యారు. మిజోరం గవర్నర్‌ నిర్బయ్‌ శర్మ పదవి కాలం మే 28తో ముగియనుండడంతో నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు ప్రకటించాయి. రాజశేఖరన్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2015లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితులైయ్యారు.