BJP MEETING: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలైన సమావేశం రాత్రి 10 గంటల వరకు సాగింది. రెండవరోజు ఆదివారం ఉదయం 10 గంటల నుంచే సమావేశంప్రారంభం కానుంది. 10 గంటలకు సమావేశానికి హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 4-30 వరకు అక్కడే ఉండనున్నారు. తర్వాత నోవాటెల్ లో హోటల్ లో గంటపాటు రెస్ట్ తీసుకోనున్నారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు బయలుదేరుతారు. సాయంత్రం 5.55 HICC వద్ద హెలిప్యాడ్ కి చేరుకోనున్న ప్రధాని.. సాయంత్రం 6.15 నిమిషాలకు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కి రానున్నారు. అక్కడి నుంచి 6 .30 నిమిషాలకి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు మోడీ హాజరవుతారు. 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో ఉంచారు. ప్రసంగం పరేడ్ గ్రౌండ్స్ నుంచి బయలుదేరనున్న మోడీ రాజ్ భవన్ వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 9.20కు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరుతారు ప్రధాని మోడీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. జనసమీకరణ కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్ లను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి జనసమీకరణ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చూస్తుండగా.. జిల్లాల బాధ్యతలను బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ సభ నుంచే వచ్చే ఎన్నికలకు సమరశంఖారావం పూరించబోతోంది బీజేపీ. అందుకే ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేస్తున్నారు కమలం నేతలు.


ఇక పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. మే నెలలో హైదరాబాద్ కు వచ్చిన మోడీ.. బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గాల రోజే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని హైదరాబాద్ కు రప్పించి హడావుడి చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లోనూ రెచ్చగొట్టేలా  ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ బ్యానర్లు కట్టారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కొంత కాలంగా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమంలో మరోసారి బీజేపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. ప్రధాని మోడీని సేల్స్ మెన్ తో పోల్చారు. అంతేకాదు పలు ప్రశ్నలు సంధించి బీజేపీ సభలో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా కేసీఆర్ చేసిన ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ సర్కార్ తో పాటు సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో జోష్ వచ్చేలా మోడీ ప్రసంగం ఉండబోతుందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారన్నది ఉత్కంఠగా మారింది.


Read also: Rain Alert: ప్రధాని మోడీ సభకు గండం! తెలంగాణకు మూడు రోజుల రెయిన్ అలర్ట్..


Read also:  Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వేలమందికి పదోన్నతులు


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook