బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ( Bihar CM ) ఎవరనేది తేలిపోయింది. బీజేపీ కంటే జేడీయూ తక్కువ స్థానాలు సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి సీఎం అవుతారా లేదే అనే సందేహం నెలకొంది వాస్తవానికి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Assembly Elections ) ఎగ్జిట్ పోల్స్ ( Exit polls ) అంచనాల్ని కాదని ఎన్డీయే కూటమి ( NDA Alliance ) మెజార్టీ దక్కించుకుంది. అయితే కూటమిలోని బీజేపీకు జేడీయూ ( JDU ) కంటే ఎక్కువ స్థానాలు లభించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ( Bjp ) 73 స్థానాలు దక్కించుకోగా..నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ కు 43 స్థానాలే లభించాయి. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే సస్పెన్ష్ నెలకొంది. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ..మళ్లీ నితీష్ కుమారే పగ్గాలు చేపడతారని బీజేపీ ప్రకటించింది. దీపావళి తరువాత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తాని జేడీయూ తెలిపింది.


మరోవైపు నితీష్‌ కుమార్‌ ( Nitish kumar ) ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నితీష్‌ కుమార్‌ జాతీయ రాజకీయాల వైపు రావాలని.. సెక్యులర్‌ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూసేవారికి వ్యతిరేకంగా పని చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. నితీష్‌ కుమార్‌ బీజేపీ నాయకుడని, గెలుపోటములనేవి ఆయన స్థాయిని దిగజార్చవని చెప్పారు. నితీష్ కుమార్ పై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. దిగ్విజయ్‌ ముందు తన సొంత రాష్ట్రంలో పార్టీ రాజకీయాలను చూసుకోవాలని ఎద్దేవా చేశారు. Also read: KBC 12: తొలి కోటీశ్వరురాలు ఆమెనే..మరి 7 కోట్లు గెల్చుకుందా