కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు తడబడిన వీడియోలను బీజేపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. "రాహుల్‌జీ.. మీరు పార్లమెంటులో మాట్లాడాలని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడేటప్పుడు కలిగే వినోదాన్ని ఎలా మిస్ అవుతాం" అని ట్వీట్ చేశారు బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నిర్వాహకులు. దాదాపు రెండు గంటల్లోనే ఆ ట్వీట్ 1600 సార్లు రీట్వీట్ చేయబడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ట్వీట్ చేశాక, బీజేపీ మరో ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్‌లో ఒక కార్టూన్ పోస్టు చేశారు. ఆ కార్టూన్‌లో ప్రఖ్యాత కర్ణాటక ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పలకడానికి మోదీ రాహుల్ గాంధీకి 15 నిముషాలు సమయం ఇవ్వగా.. రాహుల్ ఆ పేరును సరిగ్గా పలకడానికి ప్రయత్నించి విఫలమవ్వడం అనేది కొసమెరుపు. నిజంగానే ఒకానొక సందర్భంలో రాహుల్ తన ప్రసంగంలో విశ్వేశ్వరయ్య పలకడానికి ఇబ్బంది పడ్డారు.


దానికి సంబంధించిన వీడియోని కూడా వారు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ ట్వీట్ వెలువడ్డాక, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ రాహుల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటక బిడ్డ విశ్వేశ్వరయ్య పేరు కూడా సరిగ్గా పలకడం రాని రాహుల్.. కర్ణాటకకు ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు