2019 లోక్ సభ ఎన్నికలు: బీజేపీ, జేడీ(యు), ఎల్‌జేపీ మధ్య కుదిరిన పొత్తు
2019 లోక్ సభ ఎన్నికలు: బీహార్లో బీజేపీ, జేడీ(యు), ఎల్‌జేపీ మధ్య లోక్ సభ సీట్ల పంపకాలు పూర్తి
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో వున్న అన్ని లోక్ సభ స్థానాల నుంచి కలిసి పోటీ చేసేందుకుగాను అక్కడి అధికార పార్టీ జేడీ(యు), పొత్తులో భాగస్వాములైన బీజేపీ, లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) ఒక ఏకాభిప్రాయానికొచ్చాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల నుంచి, జేడీ(యునైటెడ్) 1 స్థానాల నుంచి ఎల్‌జేపీ 6 స్థానాల నుంచి పోటీచేసేందుకు అంగీకారానికొచ్చాయి. తాజాగా ఆ మూడు పార్టీల అధినేతలు కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తమ మూడు పార్టీల మధ్య లోక్ సభ స్థానాల సంఖ్య లెక్క తేలిందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీ(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ మూడు పార్టీల పొత్తు సైతం అధికారికంగా ఖరారైనట్టుగానే భావించాల్సి ఉంటుంది.