న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆమ్ ఆద్మీ పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రజలకున్న నమ్మకంతోనే గత సాధారణ ఎన్నికలలో ఢిల్లీలో అద్భుతమైన మెజారిటీ అందించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా స్పందిస్తూ.. గత రెండు సాధారణ ఎన్నికలల్లో ఢిల్లీ వాసులు అద్భుతమైన మెజారిటీ అందించినప్పటికీ ఆ ఏడుగురు ఎంపీలు ఢిల్లీ నగరానికి చేసిందేమి లేదని పునరుద్ఘాటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఢిల్లీలో గెలిచిన 7 మంది ఎంపీలు  ప్రజల కోసం ఏదైనా చేసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు చేసిన మేలును చూసి భారతీయ జనతా పార్టీ  ఓర్వలేకపోతుందని, పైగా ఆమ్ ఆద్మీ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 



కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఎన్నికల ప్రసంగంలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కొంతైనా అంగీకరించారని, తామేమి ఢిల్లీ ప్రజలను మోసం చేయడం లేదని, ఆప్ చేసిన అభివృద్ధిపై, కేంద్రం తనకు కావలిసిన సమాచారాన్ని సేకరించడానికి అన్నీ విభాగాలను వినియోగించుకోవచ్చని, తమకేమి అభ్యంతరం లేదని ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..