Black fungus cases: దేశంలో 28,252 బ్లాక్ ఫంగస్ కేసులు.. ఆ 2 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు
Black fungus cases in India: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 28,252 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ తెలిపారు. అందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా 42 శాతం కేసులు నమోదయ్యాయి. షుగర్ వ్యాధితో బాధపడుతూ కరోనా సోకిన వారికి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ (overintake of steroids) ఇచ్చినట్టయితే, వారు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
Black fungus cases in India: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 28,252 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ తెలిపారు. అందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా 42 శాతం కేసులు నమోదయ్యాయి. జూన్ 7 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మహారాష్ట్ర, గుజరాత్ లోనే ఈ ఇన్ ఫెక్షన్ (Mucormycosis cases in India) ప్రభావం అధికంగా ఉంది. ప్రస్తుతానికి మహారాష్ట్రలో 6,339 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, గుజరాత్ లో 5,486 కేసులు గుర్తించారు.
బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 86% మంది కరోనావైరస్ నుంచి కోలుకున్న వారు కాగా మరో 62.3 శాతం మంది డయాబెటిస్ పేషెంట్స్ (Black fungus symptoms in diabetes patients) ఉన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతూ కరోనా సోకిన వారికి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ (over intake of steroids) ఇచ్చినట్టయితే, వారు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.