Kangana ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో(Maharashtra) వసూళ్లకు సంబంధించి పోలీసు శాఖలో కలకలం రేపిన ఉదంతం హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh) రాజీనామాకు దారి తీసింది. హోంమంత్రి రాజీనామా చేయగానే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. సాధువుల్ని హత్యచేసి..స్త్రీలను వేధించి హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదని కంగనా రనౌత్( Kangana Ranaut) వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఆరంభం  మాత్రమేనని..అనిల్ దేశ్‌ముఖ్‌ని ఉద్దేశించి హెచ్చరించారు. ముందు ముందు ఏం జరగుతుందో చూడాలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తన ఆఫీసుపై జరిగిన దాడి, కూల్చివేత విషయాల్ని ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. ఇప్పటికే శివసేన, బీజేపీ మధ్య మాటలయుద్ధం తీవ్రమౌతున్న దశలో కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.


ముంబై మాజీ పోలిస్ ఛీఫ్ పరంబీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు బాంబై హైకోర్టు ( Bombay High court) ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాధమిక విచారణ పూర్తి చేయాలని సీబీఐకు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. 


Also read: Garden City: సిలికాన్ సిటీ బెంగళూరుకు జై కొడుతున్న ప్రవాస భారతీయులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook