Shah Rukh Khan: డ్రగ్స్ కేసు(Drugs case)లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23)(Aryan Khan) అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే షారుక్‌ఖాన్‌కు పలువురు బాలీవుడ్(Bollywood) ప్రముఖులు అండగా నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కష్టాన్ని నమ్ముకొని పైకెదిగిన షారుక్‌ (Shah Rukh Khan) ఈ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతారని వారు తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ ‘ఓ యోధుని కుమారుడు యోధుడిలాగే బయటికి వస్తాడు’ అని ట్వీట్‌ చేశారు. మరో నటుడు శేఖర్‌ సుమన్‌ స్పందిస్తూ.. ‘11 ఏళ్ల నా కుమారుడు మరణించినపుడు పరిశ్రమ నుంచి నా వద్దకు వచ్చి పరామర్శించిన ఒకే వ్యక్తి షారుక్‌. ఆయన పరిస్థితి తలచుకుంటే చాలా బాధగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దర్శకుడు అశ్విన్‌ చౌధరి, సంగీత దర్శకుడు విశాల్‌ దదలానీ సైతం షారుక్‌కు తమ మద్దతు తెలిపారు. 


Also read:Aryan Khan: కన్నీరు పెట్టిన ఆర్యన్...భావోద్వేగానికి లోనైన షారుఖ్


ఇప్పటికే హృతిక్‌ రోశన్(Hrithik Roshan), జోయా అఖ్తర్, ఫరా ఖాన్, హన్సాల్‌ మెహతా, రవీనా టాండన్, పూజాభట్, సుచిత్రా కృష్ణమూర్తి, సోమి అలి, హాస్యనటుడు జానీ లీవర్‌ తదితరులు తమ సహనటుడికి అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.  మరోవైపు.. శనివారం సాయంత్రం షారుక్‌ఖాన్‌ డ్రైవరు వాంగ్మూలం నమోదు చేసిన ఎన్సీబీ(NCB) అధికారులు అదే రోజు రాత్రి ముంబయిలో పలుచోట్ల దాడులు జరిపి, శాంతాక్రజ్‌ ప్రాంతానికి చెందిన శివరాజ్‌ రామదాసును అరెస్టు చేశారు. నిర్మాత ఇంతియాజ్‌ ఖత్రి ఇల్లు, ఆఫీసులను తనిఖీ చేశారు. ఆయన్ను విచారించిన అనంతరం.. సోమవారం మళ్లీ తమ ముందు హాజరుకావలసిందిగా కోరారు. 


ఈ కేసులో ఇద్దరు విదేశీయులతో కలిపి మొత్తం అరెస్టయినవారి సంఖ్య 20కు చేరింది. ఈ కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. ఓ మహిళా నిందితురాలు.. శానిటరీ న్యాప్‌కిన్స్‌ ద్వారా నౌకలోకి డ్రగ్స్‌ తీసుకెళ్లినట్లు తెలిసింది. 5 గ్రాముల పిల్స్‌ రూపంలో ఉన్న ఈ డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook