Bombay High Court: వివాదాస్పద న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. కీలకమైన లైంగిక దాడి కేసులో ఇచ్చిన తీర్పు వివాదాస్పదమై ఆమె కెరీర్‌నే ప్రశ్నార్ధకం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ పుష్ప గనేడివాలా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతకుమించి రాజీనామా చేసిన వెంటనే ఆమోదం కూడా లభించడం విశేషం. లైంగిక దాడికి కొత్త నిర్వచనమిచ్చి జస్టిస్ పుష్ప వివాదాస్పదమయ్యారు. దేనిని లైంగిక దాడి అంటారు, ఏది కాదనే విషయంలో ఆమె ఇచ్చిన నిర్వచనం అప్పట్లో వివాదాస్పదమై ఆమె కెరీర్‌నే ప్రశ్నార్ధకం చేసింది. 


ఎందుకంటే వాస్తవానికి ఈ తీర్పు కంటే ముందు శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలనే సిఫార్సు ఉంది. 2021 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన తీర్పు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆ సిఫార్సుల్ని వెనక్కి తీసుకుంది. ఏడాదిపాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. ఈ గడువు కాస్తా మొన్నటితో ముగిసింది. తిరిగి పొడిగించలేదు. దాంతో తిరిగి జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేయాల్సి వచ్చేది. ఈ కారణంతోనే జస్టిస్ పుష్ప(Justice Pushpa) రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇక మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం వంటివి లైంగిక దాడి కాదంటూ 2011 ఫిబ్రవరిలో జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని పట్టుకుంటేనే లేదా తాకితేనే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ అంటే పోక్సో చట్టం పరిధిలో వస్తుందన్నారు. 


Also read: Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని ఇంకా పెద్దది చేయకండి.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook