శ్రీదేవిని బోనీకపూర్ దుబాయ్‌లో ఒంటరిగా వదిలేశొచ్చాడు : అమర్ సింగ్
శ్రీదేవి మృతి కేసులో ఆమె కుటుంబానికి సన్నిహిత మిత్రుడైన యూపీ రాజకీయవేత్త అమర్ సింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి మృతి కేసులో ఆమె కుటుంబానికి సన్నిహిత మిత్రుడైన యూపీ రాజకీయవేత్త అమర్ సింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తంతు పూర్తయ్యాకా బోనీకపూర్ యూపీ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు తనతోపాటే కలిసి లక్నో వచ్చేశారని, అలా కాకుండా తాము అక్కడే వుండి వుంటే ఈ ఘోరం జరిగేది కాదు అని అమర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం శ్రీదేవి శరీరంలో అల్కహాల్ ఆనవాళ్లు వున్నాయని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. శ్రీదేవి ఆరోజు హార్డ్ అల్కహాల్ ఏమీ తీసుకోలేదని అమర్ సింగ్ స్పష్టంచేశారు. దుబాయ్‌కి చెందిన షేక్ అల్ నహ్యన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, సోమవారం అర్ధరాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకుంటుంది అని అమర్ సింగ్ చెప్పారు.
ఇప్పటికే శ్రీదేవి డెత్ సర్టిఫికెట్ ఎన్నో అనుమానాలకు కారణం అవుతోంటే, తాజాగా అమర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసలు శ్రీదేవి పట్ల బోనీ కపూర్ వైఖరి ఏంటనే సందేహాలు లేవనెత్తేందుకు కారణమయ్యాయి.