Boxer Lovlina: అసోం డీఎస్పీగా బాక్సర్ లవ్లీనాకు బాధ్యతలు అప్పగింత..
Boxer Lovlina: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, బాక్సర్ లవ్లీనాకు డీఎస్పీ పదవిని అప్పగించి సత్కరించింది అసోం సర్కారు. ఈ మేరకు సీఎం అపాయింట్మెంట్ లెటర్‌ను లవ్లీనాకు అందజేశారు.
Boxer Lovlina Borgohain appointed DSP in Assam Police: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ (Boxer Lovlina Borgohain)..అసోం డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma),..రాష్ట్ర డీజీపీ జ్యోతి మహంత, చీఫ్ సెక్రటరీ బారుహ్ సమక్షంలో..లవ్లీనాకు నియామక పత్రం అందజేశారు. మేరీకామ్, విజేందర్ సింగ్ తర్వాత ఒలింపిక్స్ లో పతకం సాధించిన మూడో బాక్సర్ లవ్లీనా.
ఒలింపిక్స్ లో పతకం సాధించిన తర్వాత బాక్సర్ లవ్లీనాకు (Boxer Lovlina) అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కోటి రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా గౌహతిలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ నియమించారు. గత ఏడాది అక్టోబర్ 29న, అస్సాం క్యాబినెట్ డీఎస్పీ లవ్లీనా నియామకానికి ఆమోదం తెలిపింది. గతంలో స్ప్రింటర్ హిమ దాస్ (sprinter Hima Das) కూడా డీఎస్పీ పదవినిచ్చి గౌరవించింది అసోం ప్రభుత్వం. డీఎస్పీగా నియమితులైనందుకు గర్వంగా ఉందని లవ్లీనా అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Also Read: Covid-19 Update: రాష్టంలో 1,700 మంది పోలీసులకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు
“''దేశానికి, అసోం రాష్ట్రానికి మరిన్ని పతకాలు సాధించడం నా కర్తవ్యం. నేను నా శిక్షణపై దృష్టి పెడతాను. నేను బాక్సింగ్ ఆడుతున్నంత కాలం పోలీసింగ్ డ్యూటీ చేయనవసరం లేదు. బాక్సింగ్ నుంచి రిటైర్ అయిన తర్వాత పోలీసింగ్ విధుల్లో చేరతాను. ఇక నుంచి నా జీవితంలోకి కొత్త బాధ్యత వచ్చింది. నేను మరింత ప్రతిభావంతులైన ఆటగాళ్లను కనుగొనడానికి ప్రయత్నిస్తాను. నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు అస్సాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అంటూ లోవ్లినా చెప్పుకొచ్చారు.
టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) అన్నారు. ఇప్పటినుంచి బాక్సర్‌కు నెల జీతంతో పాటు ట్రైనింగ్ కోసం అదనంగా రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. గువాహటిలోనే ఆమె బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ కోచ్‌ను నియమిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు కూడా లవ్లీనా పేరు పెడతామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook