భీంరావ్ అంబేద్కర్ పేరును ఇకపై పూర్తి రూపంలో వాడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చాలామంది రాజ్యాంగ నిర్మాత పూర్తిపేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ అని తెలియదని.. ఇకపై ఈ రూపంలోనే అన్ని సందర్భాల్లో వాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సిఫార్సుల మేరకు చట్టం చేసి అంబేద్కర్ పేరు మధ్యలో  'రాంజీ' ని జోడించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇకమీదట, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధులుఅంబేద్కర్‌ను కొత్త పేరుతో పిలుస్తారు. 'రాంజీ' డాక్టర్ అంబేద్కర్ తండ్రి పేరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేవలం దళిత ఓటు బ్యాంకును కాపాడుకోనేలా కొత్తగా 'రాంజీ' ను వాడుకుంటోందని సమాజ్ వాడి పార్టీ ఆరోపించింది. పేర్లపై ఉన్న చిత్తశుద్ధి ఆయన భావాలు ఆచడంలో చూపాలంది. అయితే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆరోపణలను తిప్పికొట్టింది. భారతీయ రాజ్యాంగ నిర్మాతను పూర్తిపేరుతో పిలవాలన్న యుపి ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని   ఆర్ఎస్ఎస్ నేత రాకేష్ సిన్హా వ్యాఖ్యానించారు.


కాగా.. నిర్ణయం తీసుకున్న వెంటనే యుపీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. ఈమేరకు అన్ని శాఖలకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. అన్ని పత్రాలు,  రికార్డులలో పేరు మార్పును చేయడానికి అలహాబాద్ హైకోర్టు,  లక్నో బెంచ్‌లను కూడా కోరింది. 2017 డిసెంబరులో గవర్నర్ రామ్ నాయక్ ఈ చర్యను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు ఈ లేఖ రాశారు.