Breaking News: తనపై వస్తోన్న అన్నీ ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు హార్దిక్ పటేల్ రాజీనామా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ పార్టీ సీనియర్ నేతలు హార్దిక్ పటేల్ ను పక్కన పెట్టారని, పట్టించుకోలేదని వార్తలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లోని పాటిదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్ కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


ఎవరీ హార్దిక్ పటేల్?


2015లో జరిగిన పటేల్ ఉద్యమానికి హార్దిక్ పటేల్ నాయకత్వం వహించిన తర్వాత ఆయన వెలుగులోకి వచ్చారు. ఈ ఉద్యమ సమయంలో గుజరాత్ లోని BJP నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల ముందు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరాడు. కానీ, ఉద్యమంలో భాగంగా అల్లర్లు, ఆందోళన కేసులో దోషిగా నిలిచిన కారణంగా ఆయన పోటీలో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ పోటీ చేసేందుకు సుప్రీం అనుమతినిచ్చింది.


Also Read: Covid Cases: నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే..?


Also Read: VHP about Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదు కాదు.. మందిరం : విహెచ్‌పి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.